P Krishna
Renukaswamy Murder Case: తన ప్రియురాలికి అసభ్య మెసేజ్ లు పెడుతున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన నేరంపై కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్, నటి పవిత్ర గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
Renukaswamy Murder Case: తన ప్రియురాలికి అసభ్య మెసేజ్ లు పెడుతున్నాడన్న నెపంతో ఓ వ్యక్తిని కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన నేరంపై కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప్, నటి పవిత్ర గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
P Krishna
చేసిన పాపం చివరి వరకు వెంటాడుతుందని అంటారు..ఇప్పుడు నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడ విషయంలో అదే జరుగుతుంది. తన ప్రియురాలికి అసభ్య మెసేజ్ లు పెడుతున్నాడన్న కారణంతో క్షణికావేశంలో తన అభిమానినే అతి దారుణంగా హత్య చేయించిన కేసులో హీరో దర్శన్, పవిత్ర గౌడ తో పాటు 13 మంది నిందితులను పరప్పన అగ్రహార తరలించిన విషయం తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో పవిత్ర గౌడ్ ఏ1 అయితే దర్శన్ ఏ2 , పవన్ అనే వ్యక్తి ఏ3 గా ఉన్నారు. తాజాగా రేణుకా స్వామికి హత్య కేసులో దర్శన్, పవిత్రలకు సంబంధించిన కీలక ఆధారలు లభ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తిని కన్నడ హీరో దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ్ లు కిడ్నాప్ చేయించి ఓ షెడ్ లో దారుణంగా హింసించి చంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శన్, పవిత్ర గౌడ్ తో పాటు మరో 13 మందిని పరప్పన అగ్రహా జైలుకు తరలించారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. తాజాగా పోలీసులకు దర్శన్, పవిత్రలకు సంబంధించిన కీలక ఆధాలు లభించాయని.. ఇక వీరిద్దరు బయటపడటం కష్టమే అంటు వార్తలు వస్తున్నాయి. హత్య కేసు ఛేదించే క్రమంలో పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఏ ఒక్క వ్యక్తిని, వస్తువును వదలకుండా విచారణ చేసి.. సాక్ష్యంగా మల్చుకుంటున్నారు. ఈ హత్య కేసులో కీలక ఆధారాలు నిందితుల వేలి ముద్రలకు సంబంధించిన రిపోర్టు పోలీసుల చేతికి అందింది.
రేణుకా స్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలో వేలిముద్రలు సేకరించారు పోలీసులు. అయితే ఈ వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర వేలి ముద్రలు మ్యాచ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరితో పాటు మరో పది మంది వేలి ముద్రలు కూడా మ్యాచ్ అయ్యాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలి ముద్రలు హైదరాబాద్, బెంగుళూరు లోని ఫొరెన్సీక్ ల్యామ్స్ కు అధికారులు పంపారు. కాగా, రెండు చోట్ల నుంచి రిపోర్టు వచ్చింది. ఇక డీఎన్ఏ రిపోర్టు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వేలి ముద్రలు మ్యాచ్ అయిన నేపథ్యంలో రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర లు పూర్తిగా ఇరుక్కుపోయారని.. బయట పడటం కష్టమే అని టాక్ వినిపిస్తుంది.