కమెడియన్‌ సుధాకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘పవన్‌ కళ్యాణ్‌తో నా కొడుకు సినిమా’!

  • Author Dharani Published - 01:20 PM, Mon - 19 June 23
  • Author Dharani Published - 01:20 PM, Mon - 19 June 23
కమెడియన్‌ సుధాకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘పవన్‌ కళ్యాణ్‌తో నా కొడుకు సినిమా’!

సీనియర్‌ నటుడు, కమెడియన్‌ సుధాకర్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు నాలుగు దశబ్దాల పాటు.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు సుధాకర్‌. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌ పాత్రల్లో రాణించాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా.. కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా సుధాకర్‌ మృతి చెందారంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై ఆయన స్వయంగా స్పందిస్తూ.. తాను బతికే ఉన్నానని క్లారిటీ ఇ‍చ్చారు. దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు.

ఈ ప్రచారాల నేపథ్యంలో.. తాజాగా సుధాకర్‌ ఓ టీవీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాక ఓ న్యూస్‌ చానెల్‌కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా తొలిసారి ఆయన కుమారుడిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు సుధాకర్‌. ఇక కొడుకు సినిమాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సుధాకర్‌ కుమారుడు.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఉత్తేజ్‌ గారి దగ్గర యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడని తెలిపారు. ఇక చిరంజీవితో.. సుధాకర్‌కి ప్రత్యేక అనుబంధం ఉంది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు నా కోసం సినిమాల్లో ప్రత్యేక పాత్రలు డిజైన్‌ చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశాలేవు. అందుకే నా వారసుడిని పరిచయం చేయాలని భావిస్తున్నాను తెలిపారు. అలానే కొన్ని రోజుల క్రితమే చిరంజీవి ఇంటికి వెళ్లి ఆయనను కలిశాము. నా కొడుకు పవన్‌ కళ్యాణ్‌ అంటే చాలా ఇష్టం. మొన్న చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు తనను కలవలేదు. కానీ నా కొడుకు పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా ప్రేక్షకులకు పరిచయం కావాలని భావిస్తున్నాడు. ఇంకా అడగలేదు. కానీ అడిగితే.. పవన్‌ కళ్యాణ్‌ తప్పకుండా మాకు హెల్ప్‌ చేస్తాడు.. నా కొడుకును ఇంట్రడ్యూస్‌ చేస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు.

Show comments