Bigg Boss Telugu Season 8 Contestants List: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. కంటెస్టెంట్స్ కి సంబంధించి క్రేజీ అప్ డేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. కంటెస్టెంట్స్ కి సంబంధించి క్రేజీ అప్ డేట్!

Bigg Boss Telugu Season 8 Contestants List Speculation: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా సెంప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభిస్తారు అంటున్నారు. షోకి సంబంధించి చకా చకా ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ విషయంలో క్రేజీ వార్త ఒకటి వైరల్ అవుతోంది.

Bigg Boss Telugu Season 8 Contestants List Speculation: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా సెంప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభిస్తారు అంటున్నారు. షోకి సంబంధించి చకా చకా ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ విషయంలో క్రేజీ వార్త ఒకటి వైరల్ అవుతోంది.

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగులో దిగ్విజయంగా 8వ సీజన్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే సెట్స్ కూడా దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి అంటున్నారు. అలాగే హోస్ట్ గా నాగార్జున ఉండబోతున్న విషయం గత సీజనే అందరికీ తెలిసిపోయింది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు అంతా కంటెస్టెంట్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవరు రాబోతున్నారు? షో ఎలా ఉండబోతోంది అంటూ చాలానే ప్రశ్నలు, ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ కి సంబంధించి క్రేజీ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ షోకి సంబంధించి ఎప్పుడూ లీకులు, వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. పైగా షో దగ్గర్లో ఉంది అనగా.. అవి ఇంకాస్త జోరందుకుంటాయి. స్టార్టింగ్ సీజన్స్ లో ఇలా లేదు గానీ.. గత మూడు సీజన్స్ నుంచి మాత్రం లీకులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. హౌస్ లో రెండ్రోజుల తర్వాత ఏం జరగబోతోంది కూడా ముందే చెప్పేస్తుంటారు. ప్రస్తుతానికి షో ప్రారంభం కాలేదు కాబట్టి.. ఇన్ సైడ్ టాక్స్ ని సెన్సేషన్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ లీకులు అయితే బయటకు వస్తున్నాయి. అది కూడా కంటెస్టెంట్స్ కి సంబంధించి. అలాగే షో కూడా ఎలా ఉండబోతోంది అనే విషయాలను అనాలసిస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

ఈ లీకులను బట్టి చూస్తే.. ఈసారి కంటెస్టెంట్స్ ఎంపిక అయితే చాలా టఫ్ గా జరిగింది అంటున్నారు. అలాగే దాదాపుగా 200 మందిని అనుకుని.. వారి నుంచి 25 మందిని ఫైనల్ చేశారు అంట. ఆ 25 మందిలో కూడా 18 నుంచి 20 మందితో సీజన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత షో నడుస్తున్న కొద్దీ.. కొందరినీ వైల్డ్ కార్డ్స్ రూపంలో హౌస్ లోకి పంపిస్తారు అంటున్నారు. అంతేకాకుండా గత సీజన్ ఉల్టా పుల్టాతో పోలిస్తే.. ఈసారి ఇంకా కొత్తగా ప్లాన్ చేశారు అంటున్నారు. ఆ ట్యాగ్ లైన్ కూడా.. ‘ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే.. లిమిటే లేదు’ అని చెప్పడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. వాటికి తగ్గట్లుగా వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉంటాయి అంటూ వస్తున్న వార్తలు ఆడియన్స్ లో ఉత్సాహాన్ని పెంచేస్తున్నాయి. కంటెస్టెంట్స్ గా ఎవరు వెళ్తారు అనే విషయంపై చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, బిగ్ బాస్ లో స్టేజ్ మీదకు వచ్చే వరకు ఎవరు ఫైనల్ అని చెప్పే పరిస్థితి అయితే ఉండదు. మరి.. బిగ్ బాస్ షో లీకులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments