జానీ మాస్టర్ అనుమానం ఎవరిపై? పెద్ద బాంబ్ పేల్చాడు!

Choreographer Jani Master Case Latest update: గడిచిన రెండు మూడు రోజులుగా మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వివాదం మొదలైన తర్వాత మొదటి సారి జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు. అయితే దీని వెనుక ఎదో పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Choreographer Jani Master Case Latest update: గడిచిన రెండు మూడు రోజులుగా మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వివాదం మొదలైన తర్వాత మొదటి సారి జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు. అయితే దీని వెనుక ఎదో పెద్ద కుట్ర ఉందని భావిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక అరెస్ట్ తర్వాత మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు జానీ మాస్టర్. తానూ ఎవరి పైన లైంగిక దాడికి పాల్పడలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. పోలీసుల విచారణలో ఇప్పటివరకు తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కావాలనే ఎవరో తనపై ఇలాంటి కుట్ర పన్నారని అన్నారు. అంతే కాకుండా న్యాయ పోరాటం చేసి నిజాయితీగా బయటకు వస్తానని కూడా తెలియజేశారు . ప్రస్తుతానికి జానీ మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే జానీ మాస్టర్ మాటలను బట్టీ గమనిస్తే కనుక.. నిజంగానే దీని వెనుక ఎదో పెద్ద కథ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తానూ ఇండస్ట్రీలో ఎదగడం ఓర్వలేకనే ఎవరో కావాలని ఇదంతా చేశారు అంటూ.. జానీ మాస్టర్ చెప్పారు. జానీ మాస్టర్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా నిజాయితీగానే బయటకు వస్తానని వ్యక్తపరిచారు. దీని వెనుక ఉన్న నిజ నిజాలు అయితే ఎవరికి తెలియదు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత మాత్రమే.. తప్పు ఎవరిదీ అనే విషయం బయటపడుతుంది. మీడియా సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాలుగా కథనాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. అయితే జానీ మాస్టర్ మాటలను బట్టి గమనిస్తే అతని ఎదుగుదలను తట్టుకోలేక కావాలనే ఎవరో ఇదంతా చేశారా ! అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికి జానీ మాస్టర్ అయితే ఆ విషయం గురించి బయటపడలేదు. కానీ, ఆ చేసిన వ్యక్తులు ఎవరో కూడా ఆయనకు తెలిసే ఉంటుందని.. త్వరలోనే ఈ వివాదం వెనుక ఉన్న పెద్ద మనుషులు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనితో పోలీసులు ఈ కేసును చాలా జాగ్రత్తగా వ్యవహరించనున్నారని సమాచారం.

అసలు జానీ మాస్టర్ అనుమానం ఎవరి పైన? వారు ఇండస్ట్రీకి సంబంధించిన వారా.. లేక బయట వ్యక్తులా! ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసు విషయంలో వినిపించిన కథనాలన్నీ ఒకెత్తయితే.. జానీ మాట్లాడిన తర్వాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. అటు జానీ మాస్టర్ భార్యపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతానికి జానీ మాస్టర్ వైఫ్ కానీ, అతని కోసం వచ్చిన వ్యక్తులు కానీ.. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించడం లేదని తెలుస్తుంది.ఏదేమైనా ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మాత్రం.. పోలీసుల విచారణ పూర్తవ్వాల్సిందే. ఇక ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో.. ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.. అసలు నిజానిజాలు ఏంటో తెలియాలంటే. వెయిట్ చేయాల్సిందే. మరి జానీ మాస్టర్ మీడియాతో స్పందించిన తీరుపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments