Triptii Dimri: త్రిప్తి దిమ్రి కొత్త సాంగ్ చూశారా! ఇది యానిమల్ కన్నా 100 రెట్లు!

Triptii Dimri New Song.. యానిమల్ మూవీతో ఓవర్ నైట్ నేషనల్ క్రష్ ట్యాగ్ దోచేసింది త్రిప్తి దిమ్రి. ఆమె కెరీర్ యానిమల్ మూవీకి ముందు ఆ తర్వాత అన్నట్లుగా తయారయ్యింది. ఒక్క సీనుతో కుర్రాళ్ల గుండెల్ని మెలిపెట్టేసింది. ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇది చూస్తే..

Triptii Dimri New Song.. యానిమల్ మూవీతో ఓవర్ నైట్ నేషనల్ క్రష్ ట్యాగ్ దోచేసింది త్రిప్తి దిమ్రి. ఆమె కెరీర్ యానిమల్ మూవీకి ముందు ఆ తర్వాత అన్నట్లుగా తయారయ్యింది. ఒక్క సీనుతో కుర్రాళ్ల గుండెల్ని మెలిపెట్టేసింది. ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇది చూస్తే..

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన మూవీ యానిమల్. గత ఏడాది చివరిలో రిలీజై సుమారు రూ. 900 కోట్లను కొల్లగొట్టింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మరో బ్యూటీ త్రిప్తి దిమ్రి. జోయా పాత్రలో మెస్మరైజ్ చేసింది. ఒక్క సీనుతో కుర్రాళ్ల గుండెల్ని ఖరాబ్ చేసేసింది. హాట్ అండ్ బోల్ట్ లుక్స్‌లో దర్శనమిచ్చి కాక రేపింది. స్క్రీన్ ప్రజెన్స్ కాసేపే అయినా గ్లామర్ ఒలికించి రష్మిక నేషనల్ క్రష్ ట్యాగ్ అమాంతం లాగేసుకుంది. గతంలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ రాని ఇమేజ్.. కేవలం యానిమల్ మూవీతో వచ్చేసింది త్రిప్తికి. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు చేస్తుంది ఈ ఉత్తరాఖండ్ భామ. వాటిల్లో ఒకటి బ్యాడ్ న్యూస్. విక్కి కౌశల్, అమీ విర్క్ హీరోలుగా నటిస్తున్నారు. ఫుల్ లెంత్త్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్.. ఒక లవర్. అంతలో త్రిప్తి దిమ్రి ప్రెగ్నెంట్ కావడం.. ఇద్దరు బిడ్డ తండ్రులే అని తేలడం ఫన్నీగా సాగిపోయింది ట్రైలర్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్, లియో వీడియా కలెక్టివ్, అమెజాన్ ప్రైమ్ బ్యానర్ పై కరణ్ జోహార్, హీరో యాష్ జోహార్, అపూర్వ మోహతా, అమృత్ పాల్ సింగ్ బింద్రా, ఆనంద్ తివారీ నిర్మించారు. యంగ్ డైరెక్టర్ ఆనంద్ తివారీ దర్శకుడు. ఈ మూవీ జులై 19న విడుదల కాబోతుంది.

ఈ సందర్భంగా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. తాజాగా ఈ మూవీకి సాంగ్ రిలీజ్ చేసింది. జనమ్ అంటూ సాగిపోతున్న పాటను రిలీజ్ చేయగా.. అత్యంత తక్కువ సమయంలో యూట్యూబ్‌ను షేక్ చేసేస్తుంది. ఇందులో మరోసారి తన హాట్ అందాలతో కవ్విస్తోంది త్రిప్తి దిమ్రీ. పూర్తిగా రొమాంటిక్ మూడ్‌లో సాగిపోతోంది ఈ సాంగ్.  యానిమల్ కన్నా వంద రెట్లు బోల్డ్ సీన్స్ కనిపిస్తున్నాయి ఇందులో.  బికినీలో త్రిప్తి మెంటల్ ఎక్కించేస్తుంది. మత్తెక్కించే కళ్లతో, కవ్విస్తూ సెగలు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చేతిలో బ్యాడ్ న్యూస్ కాకుండా వికీ విద్యా కాహో వాలా వీడియో, బుల్ బులియా 3, ధడక్ 2 వంటి బిగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే యానిమల్ పార్క్ లో కనిపించనుందని తెలుస్తుంది.

Show comments