iDreamPost
android-app
ios-app

రెండో రోజూ అదే జోరు.. బేబీ కలెక్షన్లు ఎంతంటే..

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి, విరాజ్‌ల నటనకు సామాన్య ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమాను సంచలన విజయం చేశారు. ఇక, ఈ సినిమా తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఓ చిన్న సినిమా ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టం ఈ మధ్య కాలంలో అత్యంత అరుదుగా జరిగింది.

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి, విరాజ్‌ల నటనకు సామాన్య ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమాను సంచలన విజయం చేశారు. ఇక, ఈ సినిమా తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఓ చిన్న సినిమా ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టం ఈ మధ్య కాలంలో అత్యంత అరుదుగా జరిగింది.

రెండో రోజూ అదే జోరు.. బేబీ కలెక్షన్లు ఎంతంటే..

 ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ‘బేబీ’ సినిమా పేరు మారుమోగుతోంది. సాయి రాజేష్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్‌కు బాగా ఎక్కేసింది. ముఖ్యంగా 2కే కిడ్స్‌ బాగా కనెక్ట్‌ అయిపోయారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి, విరాజ్‌ల నటనకు సామాన్య ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమాను సంచలన విజయం చేశారు. ఇక, ఈ సినిమా తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఓ చిన్న సినిమా ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు రాబట్టం ఈ మధ్య కాలంలో అత్యంత అరుదుగా జరిగింది. ఆ అత్యంత అరుదైన రికార్డును బేబీ సినిమా అందుకుంది.

ఈ సినిమా తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 2.60 కోట్ల షేర్‌.. 4.65 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా 10 లక్షల రూపాయలు.. ఓవర్సీస్‌లో 78 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల రూపాయల షేర్‌.. 6.55 కోట్ల రూపాయల గ్రాస్‌ను రాబట్టింది. రెండో రోజు కూడా బేబీ కలెక్షన్ల పరంపరను కొనసాగించింది. రెండో రోజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 5.15 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా.. 6.75 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.

ఈ సినిమా దాదాపు 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ‘బేబీ’ నిర్మాతలకు లాభాల పంట పండించింది. ఇక, ఓటీటీ రైట్స్‌ విషయంలోనూ ఈ సినిమా సంచలనానికి తెరతీసింది. ఏకంగా 8 కోట్ల రూపాయలకు  అమ్ముడుపోయింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ఇలా, అన్ని రకాలుగా బేబీ అద్భుతాలను సృష్టిస్తోంది. మరి, కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తున్న బేబీ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.