Hanuman Movie- Ayodhya Ram Mandir: సరికొత్త చరిత్ర.. అయోధ్యలో బాల రాముడు- థియేటర్లలో హనుమంతులవారు..

సరికొత్త చరిత్ర.. అయోధ్యలో బాల రాముడు- థియేటర్లలో హనుమంతులవారు..

Ayodhya Ram Mandir- Hanuman Movie: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట రోజు.. హనుమాన్ సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది.

Ayodhya Ram Mandir- Hanuman Movie: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట రోజు.. హనుమాన్ సినిమా సరికొత్త చరిత్రను సృష్టించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామయ్య పేరు మారు మోగుతోంది. మరీ ముఖ్యంగా నార్త్ లో అయితే అయోధ్యలో బాల రాముడి పేరు, థియేటర్లలో హనుమాన్ సినిమా పేరు మారు మోగుతున్నాయి. సంక్రాంతి బరిలో వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి పాన్ ఇండియా లెవల్లో అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇంక కలెక్షన్స్ పరంగా అయితే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో బడా హీరోల రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు మరో రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం దేశంలో అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట, హనుమాన్ చిత్రం గురించే బజ్ నడుస్తోంది. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా ముగిసింది. ఇదే రోజు ఆ హనుమంతుల వారి పేరు మీద విడుదలైన హనుమాన్ సినిమా అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. విడుదలైన 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి ఎలైట్ క్లబ్ లో చేరిపోయింది. కేవలం రూ.45 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మాత్రం తన సత్తాను చాటుతూనే ఉంది. ప్రశాంత్ వర్మ విజన్ కు ఈ రికార్డు నిదర్శనంగా చెప్పచ్చు. తమ చిత్రం రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2024లో రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన తొలి చిత్రంగా హనుమాన్ రికార్డులు క్రియేట్ చేసింది. అది కూడా ఇలాంటి ఒక అద్భుతమైన రోజు ఇలాంటి ఘనత సాధించడంపై మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేస్తోంది.

హనుమాన్ మూవీ టీమ్ మొదటి నుంచి అయోధ్య ప్రాణ ప్రతిష్ట రోజు గురించి ప్రస్తావిస్తూనే ఉంది. ఈసారి హనుమంతుడి కోసం రామయ్య రాబోతున్నారు అంటూ ఎంతో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. వారు చెబుతున్న విధంగానే జనవరి 22న హనుమాన్ మూవీ ఈ ఫీచ్ ను సాధించడం నిజంగా స్పెషల్ మూమెంట్ అవుతుంది. అలాగే అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట కోసం హనుమాన్ మూవీ టీమ్ రూ.2.55 కోట్లకు పైగా విరాళంగా అందించన విషయం తెలిసిందే. హనుమాన్ మూవీ టికెట్స్ నుంచి టికెట్ కు రూ.5 చొప్పున అయోధ్య రామయ్యకు విరాళంగా అందజేశారు. చెప్పడం మాత్రమే కాకుండా వాళ్లు చేసి చూపించారు. హనుమాన్ మూవీకి సౌత్ లోనే కాకుండా.. నార్త్ లో కూడా విపరీతమైన స్పందన లభిస్తోంది.

ఈ మూవీ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు. లాంగ్ రన్ లో ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్ లో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రంపై కూడా ఒక క్లారిటీ ఇచ్చాడు. 2025లో జై హనుమాన్ చిత్రం విడుదలవుతుందని చెప్పాడు. ఈసారి హనుమంతుల వారిగా స్టార్ హీరో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. ఈ గ్యాప్ లో మరో రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాను అంటూ ప్రకటించాడు. మరి.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట రోజు హనుమాన్ సినిమా సూపర్ రికార్డును క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments