Venkateswarlu
ఈ మధ్య కాలంలో థియేటర్ లో విడుదలైన ప్రతీ చిత్రం ఓటీటీలో అడుగు పెడుతోంది. కేవలం ఓటీటీ లో మాత్రమే మరికొన్ని చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ చిత్రాలను ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తున్నారు...
ఈ మధ్య కాలంలో థియేటర్ లో విడుదలైన ప్రతీ చిత్రం ఓటీటీలో అడుగు పెడుతోంది. కేవలం ఓటీటీ లో మాత్రమే మరికొన్ని చిత్రాలు విడుదల అవుతున్నాయి. ఈ చిత్రాలను ప్రేక్షకులు అదే స్థాయిలో ఆదరిస్తున్నారు...
Venkateswarlu
‘సందీప్ రెడ్డి వంగా’… టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ ఈయన పేరు మారుమోగుతోంది. తన తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’తో తెలుగు నాట.. కబీర్ సింగ్‌తో హిందీలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో అర్జున్ రెడ్డి సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇదే మూవీని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కబీర్ సింగ్ హిట్ అవటంతో హిందీలోనే మరో సినిమా చేశారు సందీప్.
అనిమల్ పేరిట తెరకెక్కిన ఈ సినిమాలో ‘రణ్ బీర్ కపూర్’, ‘రష్మిక మందన్న’ జంటగా నటించారు. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓటీటీ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అనిమల్ సినిమాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందునుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంలు పోటీ పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ వేదికైన ‘నెట్ ఫ్లిక్స్’ ‘అనిమల్’ మూవీ డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్ కు దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే హిందీలో ‘సోనీ’ సంస్థ ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుందట.
సినిమాకు థియేటర్లలో వచ్చే స్పందనను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్ చేయనున్నారట. డిసెంబర్ చివరి వారంలో అనిమల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ మూడో వారంలో స్ట్రీమింగ్ డీటేల్స్ విడుదల అవ్వవచ్చు. కాగా, డిసెంబర్ 1 న ‘అనిమల్’ మూవీ థియేటర్ లలో విడుదల కానుంది. చిత్రం 3 గంటలకు పైగా ఉండటం సినిమాకు మైనస్ అయ్యే అవకాశం ఉందని చిత్ర విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం చిత్ర ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలైంది. అన్నీ భాషల్లోనూ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
విడుదలైన కొన్ని నిమిషాల్లో లక్షల వ్యూస్‌తో సాధించింది. అంతేకాదు! సినిమాపై అంచనాలు అటు, ఇటు కాకుండా ట్రైలర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాలో తాను ఏం చెప్పాలనుకున్నాడో.. ట్రైలర్‌లో చూపించేశాడు. తండ్రి కోసం ఆరాటపడే కొడుకు పాత్రలో రణ్‌బీర్ కపూర్ కనిపించనున్నారు. ఇది రివేంజ్ స్టోరీనే అయినా.. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సినిమా ఎక్కువగా వాయిలెన్స్ చుట్టూ తిరిగినా.. ఆ వాయిలెన్స్‌కు కారణం ఏంటన్న దాని చుట్టే కథ నడుస్తుంది. మరి, అనిమల్ ఓటీటీ స్ట్రీమింగ్ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.