ఓయ్ డైరెక్టర్ ఎమోషనల్ వర్డ్స్.. కెరీర్ నాశనం అయ్యాక దేనికి అంటూ!

ఓయ్ డైరెక్టర్ ఎమోషనల్ వర్డ్స్.. కెరీర్ నాశనం అయ్యాక దేనికి అంటూ!

ఇటీవల ఓయ్ సినిమా రీరిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈ రీరిలీజ్ లో ఓయ్ చేసిన హడావిడి అంత ఇంత కాదు. ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు ఆనంద్ రంగ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓయ్ సినిమా రీరిలీజ్ అయినా సంగతి తెలిసిందే. ఈ రీరిలీజ్ లో ఓయ్ చేసిన హడావిడి అంత ఇంత కాదు. ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు ఆనంద్ రంగ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాలీవడ్ లో ప్రస్తుతం కొనసుగుతున్న రీరిలీజ్ ల ట్రెండ్ గురించి అందరికి తెలిసిందే. అయితే, ఈ రీరిలీజ్ ల పుణ్యమా అని.. ఒకప్పుడు థియేటర్ లో విడుదల చేసినపుడు అంతగా ఆకట్టుకొని సినిమాలు కూడా.. ఇప్పుడు థియేటర్ ని కాన్సర్ట్ లెవెల్ లో మార్చేస్తున్నాయి. అప్పుడు అదే సినిమా.. ఇప్పుడు అదే సినిమా.. కానీ, ఒకప్పుడు ఆదరణ లభించని సినిమాకు .. ఇప్పుడు మాత్రం భారీ లెవెల్లో క్రేజ్ పెరిగిపోతుంది. దానికి కారణం ఏమై ఉంటుందో తెలియదు కానీ, ఆయా సినిమాల దర్శకులకు మాత్రం..ఇప్పుడు హ్యుజ్ పాపులారిటీ తెచ్చుకుంటున్నందుకు ఆనందపడాలో.. అప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్నందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉంటున్నారు. తాజా రీరిలీజ్ లో భాగంగా సిద్ధార్ నటించిన “ఓయ్” సినిమా విడుదలై .. ఆ సినిమా థియేటర్లలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ హడావిడికి మూవీ టీం నిజంగా ఇది తమ సినిమానేనా అనేలా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ఓయ్ మూవీ డైరెక్టర్ ఆనంద్ రంగా చేసిన వ్యాఖ్యలు .. ఇప్పుడు అందరిని ఆలోచింపజేసేలా మారాయి.

ఇటీవల రీరిలీజ్ లో భాగంగా “ఓయ్”సినిమాకు వచ్చిన భారీ క్రేజ్ లభించింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా హడావిడే కనిపించింది. దీనితో మూవీ టీం అంతా చాలా హ్యాపీ అయ్యారు. హీరో సిద్దార్ద్ కూడా హైదరాబాద్ కు వచ్చి మరీ .. ఓయ్ రీరిలీజ్ సందడిని చూసాడు. కానీ, ఈ మూవీ డైరెక్టర్ కు మాత్రం ఆనందపడాలో.. బాధపడాలో అర్థంకాని సిట్యుయేషన్ లో ఉన్నారని చెప్పి తీరాలి. ఆయన ఈ రీరిలీజ్ గురించి మాట్లాడుతూ.. “ఇప్పుడు ఓయ్ ని ఇంతగా ప్రేమిస్తున్న వాళ్ళు.. ఒరిజినల్ గా రిలీజైన టైంలోనే ఈ స్పందన చూపించి ఉంటే నాకో మంచి కెరీర్ దక్కేది. సెకండ్ హాఫ్ ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం తప్పే.. ఒప్పుకుంటాను కానీ.. మరీ తిరస్కరించేంత చెడ్డ సినిమా అయితే కాదు” అంటూ నిరాశగా తన భావాలను వ్యక్తపరిచారు. ఈ దర్శకుడు అన్న మాటల్లో నిజం లేకపోలేదు. ఒకవేళ నిజంగానే ఆ సమయంలో ఈ సినిమాను హిట్ చేసి ఉంటే.. ఆనంద్ రంగాకు మంచి బ్రేక్ లభించేది. ఇండస్ట్రీకి మరికొన్ని సినిమాలను ఇచ్చే ఛాన్స్ ఉండేది. కానీ, కెరీర్ నాశనం అయినా తర్వాత ఇప్పుడు ఎంత ప్రేమ చూపించిన .. ఆ పీక్ టైం మళ్ళీ తిరిగి రాదు కదా అనే ధోరణిలో ఆనంద్ చెప్పుకొచ్చారు.

గతంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో సుష్మిత కొణిదెల నిర్మించిన షూట్ అవుట్ ఏట్ అలైర్ .. వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు ఆనంద్ రంగా. కానీ, అది ఆశించిన స్థాయిలో రీచ్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ రీరిలీజ్ కారణంగా అయినా.. తిరిగి ఆనంద్ రంగా కు మంచి బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు. ఒకప్పుడు ప్లాప్ అయ్యి.. ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకోవడం అనేది ‘ఓయ్’ సినిమాకు మాత్రమే కాదు.. గతంలోను రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీరిలీజ్ అప్పుడు కూడా ఇలానే అయింది. కాబట్టి.. ఈ దర్శకులు వాపోతున్న దానిలో నిజం లేకపోలేదు. మరి, ఓయ్ సినిమా రీరిలీజ్ కు సంబంధించి .. దర్శకుడు ఆనంద్ రంగ చెప్పుకొచ్చిన విషయాలపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments