పెళ్ళైన ఐదేళ్లకు గుడ్ న్యూస్! బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్!

  • Author ajaykrishna Published - 02:06 PM, Sat - 16 September 23
  • Author ajaykrishna Published - 02:06 PM, Sat - 16 September 23
పెళ్ళైన ఐదేళ్లకు గుడ్ న్యూస్! బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్!

ఇండస్ట్రీలో ఎలా అడుగు పెట్టినా.. సెలబ్రిటీ హోదా వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించుకొని.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారు కొందరు. లేదు ఈ సోషల్ మీడియా గోలంతా మనకు ఎందుకు అనుకొని సైలెంట్ గా ఉండేవారు కొందరు. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారి సంఖ్య ఎక్కువ. లైఫ్ ఏ విషయమైనా.. అది ప్రొఫెషనల్, పర్సనల్ ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పంచుకుంటున్నారు. తాజాగా బిగ్ బాస్ విన్నర్, సీరియల్ నటి రూబీనా దిలక్.. పెళ్ళైన ఐదేళ్లకు ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది.

పెళ్ళైన ఐదేళ్లకు గుడ్ న్యూస్ అంటే.. మీరు ఏది అనుకుంటున్నారో అదే ఆమె చెప్పింది. అవును.. రూబీనా దిలక్ త్వరలో తల్లి కాబోతుంది. ఈ మేరకు తన భర్త అభినవ్ శుక్లాతో దిగిన ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం భర్తతో కలిసి వేకెషన్ లో ఉన్న ఈ భామ.. పోస్ట్ చేసిన ఫోటోలలో బేబీ బంప్ క్లియర్ గా కనిపిస్తుంది. అంతేగాక ఆమె పోస్ట్ లో.. ‘మేమిద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. మేం డేటింగ్‌ లో ఉన్నప్పుడే ఈ విషయం చెప్పాను. ఆ తర్వాత పెళ్ళైంది. మాకంటూ ఓ ఫ్యామిలీ ఏర్పరచుకున్నాం. త్వరలో మా ఫ్యామిలీలోకి ఓ బుల్లి ట్రావెలర్ రాబోతుంది” అని రాసుకొచ్చింది. దీంతో ఫ్యాన్స్ కి ప్రెగ్నెన్సీ అని క్లారిటీ వచ్చి విష్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత దాదాపు ఐదేళ్లకు గర్భం దాల్చడంతో రూబీనా ఎమోషనల్ అయిపోయింది. మరి అసలు అభినవ్ తో లవ్ స్టోరీ ఎలా మొదలైంది? అనంటే.. ఓసారి గణపతి ఉత్సవాల సందర్బంగా అభినవ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడట. అక్కడ రూబీనాని చూసి ఇష్టపడ్డాడట. దాంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ఫ్రెండ్స్ అయ్యారు. అది కాస్త కొన్నాళ్ళకు ప్రేమగా మారి 2018లో పెళ్లి చేసుకున్నారు. కాగా.. హిందీలో సీరియల్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన రూబీనా.. 2020లో బిగ్ బాస్ సీజన్ 14లో పాల్గొని టైటిల్ విన్ అయ్యింది. అప్పటినుండి రూబీనాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అందుకే తనను గెలిపించి సపోర్ట్ గా నిలిచిన ఫ్యాన్స్ కి ఏ విషయమైనా షేర్ చేసుకుంటుంది రూబీనా. మరి రూబీనా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments