Mrunal Thakur, Mahesh Babu: మహేష్ గురించి మనసులో మాట బయట పెట్టిన సీతారామం బ్యూటీ!

మహేష్ గురించి మనసులో మాట బయట పెట్టిన సీతారామం బ్యూటీ!

  • Author Soma Sekhar Updated - 09:29 PM, Wed - 12 July 23
  • Author Soma Sekhar Updated - 09:29 PM, Wed - 12 July 23
మహేష్ గురించి మనసులో మాట బయట పెట్టిన సీతారామం బ్యూటీ!

ఇండస్ట్రీలో కొంత మందికి 10 సినిమాలు చేసినా.. రావాల్సినంత పేరు రాదు. కానీ ఇంకొందరికి మాత్రం కేవలం ఒకేఒక్క సినిమాతో స్టార్ డమ్ వస్తుంది. అలా పేరొచ్చిన వారు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లాకు, డైరెక్టర్ కేవీ అనుదీప్ స్టార్ డమ్ వచ్చింది. ఇక ఇదే కోవలోకి వచ్చింది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ అమ్మడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. అమ్మడుకి అవకాశాలు క్యూ కట్టాయి. అయితే స్టార్ హీరోల సరసన నటిస్తున్నప్పటికీ.. తనకు ఓ కోరిక ఉందని తాజాగా బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై తన మనసులోని మాటను బయటపెట్టింది.

మృణాల్ ఠాకూర్.. సీతారామం ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో నటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఎంతో మంది హీరోలతో సినిమాలు చేసినా, చేస్తున్నా.. తన డ్రీమ్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించడమే అని చెప్పుకొచ్చింది. నా కెరీర్ లో బిగ్గెస్ట్ డ్రీమ్ ఏదైనా ఉంటే.. అది మహేష్ తో జోడీగా నటించడమే అని పేర్కొంది. తన కల నెరవేరాలని ప్రతిరోజూ ప్రార్థిస్తానని చెప్పుకొచ్చింది. మహేష్ తో నటించాలని చాలా మంది హీరోయిన్స్ కలలు కంటూ ఉంటారు. కానీ అందరికి ఆ కల సాధ్యం కాదు. ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పలు హిందీ చిత్రాలతో పాటుగా.. నాచురల్ స్టార్ నాని నటిస్తున్న 30వ సినిమా, విజయ్ దేవరకొండ 13వ సినిమాలో నటిస్తోంది. మరి మహేష్ బాబుతో నటించడమే తన డ్రీమ్ రోల్ అని చెప్పిన మృణాల్ ఠాకూర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: అప్పట్లో బోల్డ్ బ్యూటీగా.. ఇప్పుడు యోగినిగా మారిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Show comments