అప్పట్లో బోల్డ్ బ్యూటీగా.. ఇప్పుడు యోగినిగా మారిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

  • Author Soma Sekhar Updated - 07:44 PM, Wed - 12 July 23
  • Author Soma Sekhar Updated - 07:44 PM, Wed - 12 July 23
అప్పట్లో బోల్డ్ బ్యూటీగా.. ఇప్పుడు యోగినిగా మారిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్.. ఓ టైమ్ వచ్చాక ఫేడౌట్ కాక తప్పదు. అవకాశాలు రాక చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీని వదిలివెళ్తుంటారు. వారు పరిశ్రమను వదిలివెళ్లిన తర్వాత ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అన్న విషయాలు తెలుసుకోవాలని అభిమానులకు ఉత్సాహం ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ నటి స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుని.. ప్రస్తుతం యోగినిగా మారింది. అప్పట్లో బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరుగా నిలిచింది ఈ బ్యూటీ. తన అందంతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది ఈ అమ్మాడు. మరి స్టార్ హీరోయిన్ రేంజ్ నుంచి యోగినిగా మారిన ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీని దివ్యభారతి ఏలుతున్న రోజులవి. దివ్య భారతి ప్రమాదవశాత్తు ప్రాణాలు విడవడంతో.. మమతా కులకర్ణి ఫామ్ లోకి వచ్చింది. దానికి కారణం ఆమె కొన్ని యాంగిల్స్ లో దివ్య భారతిలా కనిపించడమే. అందుకే దివ్య భారతి చనిపోయాక.. మమతా కులకర్ణికి ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాలను వాడుకుని టాప్ ప్లేస్ లోకి వెళ్లాలని ఈ అమ్మడు ప్రయత్నాలు మెుదలు పెట్టింది. అందులో భాగంగానే బట్టలు లేకుండా ‘డస్ట్ మ్యాగజైన్’ కవర్ పేజీలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు అప్పట్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాయనే చెప్పాలి.

ఇక తన కెరీర్ ఊపుమీదున్న టైమ్ లోనే డ్రాగ్ లార్డ్ విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. కానీ రూ. 2000 కోట్ల డ్రగ్స్ కేసులో మమతా కులకర్ణి హస్తం ఉందని తేలడంతో.. అరెస్ట్ అయ్యింది. ఆ తర్వాత నుంచి తెరమరుగు అయిన ఆమె.. 2010లో యోగినిగా మారిపోయి కనిపించి అందరికి షాకిచ్చింది. ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిని’ పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాసింది ఈ బ్యూటీ. తన గ్లామర్ తో హీరోయిన్ గానే కాకుండా ఐటెమ్ సాంగ్స్ తో సైతం మైమరపించింది. తన అందచందాలతో ఇండస్ట్రీని ఓ ఊపుఊపింది మమతా కులకర్ణి. హీరోయిన్ రేంజ్ నుంచి యోగినిగా మారిన మమతా కులకర్ణిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: నా డివోర్స్ కి తనే కారణం.. క్షమించను! స్టార్ హీరోయిన్ పై నటి ఫైర్

Show comments