P Krishna
Actress Kapila Venu Issue: రోజు రోజుకీ మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు ఈ తిప్పలు తప్పడం లేదని అంటున్నారు.
Actress Kapila Venu Issue: రోజు రోజుకీ మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు ఈ తిప్పలు తప్పడం లేదని అంటున్నారు.
P Krishna
దేశంలో సామాన్య మహిళలకే కాదు.. సెలబట్రెటీలకు సైతం లైంగిక వేధింపులు తప్పడం లేదు. సాధారణంగా ఇండస్ట్రీకి చెందిన నటీమణులు బయట ఏదైనా ఫంక్షన్లు, దేవాలయాలు, ఇతర ప్రదేశాలకు వెళ్లినపుడు చేదు అనుభవాలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఎంత సెక్యూరిటీ ఉన్న ఏదో ఒక సమయంలో ఫిజికల్ గా తాకూతూ అవమానించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గతంలో కాజల్, సమంత, తమన్నా, యాంకర్ అనసూయ, రష్మి ఇలా కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు చేదు అనుభవాలు జరిగాయి. అలాంటి అనుభవమే మాలీవుడ్ డ్యాన్సర్, నటి కపిల వేణుకి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
లారెన్స్ హీరోగా ఇటీవల రిలీజ్ అయిన జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో కీలక పాత్రలో నటించిన మాలీవుడ్ నటి కపిల వేణుకి ఘోర అవమానం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తన స్నేహితురాలి డ్యాన్స్ పర్ఫామెన్స్ చూడటానికి లోకల్ గా ఉన్న ఒక గుడి ఉత్సవానికి హాజరయ్యానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు తెలియకుండా ఎగ్జీట్ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశానని.. విషయం అర్థం చేసుకొని ఎగ్జిట్ నుంచి ఎంట్రీ క్యూలోకి వెళ్లే ప్రయత్నం చేశానని చెప్పింది. ఆ సమయంలో నాకు జరిగిన పరాభవం ఇప్పటికీ మర్చి పోలేకపోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
గుడిలో జరిగే ఉత్సవానికి హాజరైన సమయంలో ఎగ్జిట్ నుంచి వెళ్తుంటే అక్కడ ఉన్న ఒక వాలంటీర్ వచ్చి నన్ను తాకుతూ ఆపేశాడు. అంతటితో ఆగలేదు.. రూడ్ గా మాట్లాడాడు. నాకు అప్పుడు కోపం వచ్చింది.. ఏదైన ఉంటే ఆపి మాట్లాడాలి ఇలా చేయి పట్టుకొని ఆపడం ఏంటని గట్టిగానే ప్రశ్నించాను. అతను కూడా ఏమాత్రం తగ్గకుండా నాతో దురుసుగా మాట్లాడాడు. మా మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో మరో ఆరుగురు వాలంటీర్లు అక్కడికి వచ్చి నన్ను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు.. వెంటనే వెళ్లిపోవాలని సూచించారు. ఆ సమయంలో నాకు పానిక్ ఎటాక్ అవుతుందేమో అన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారు కూడా ఈ విషయాంపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేమని చెప్పుకొచ్చారు.
అక్కడ జరుగుతున్న సంఘటన నాకు ఎంతో ఆవేదన, దుఖాఃన్ని కలిగించాయి. నాకు కన్నీళ్లు ఆగలేదు.. నేను కన్నీరు పెట్టుకోవడం చూసి పోలీసులు కమిటీ మెంబర్లతో మాట్లాడామని.. వారు వాలంటీర్ల దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత నా తండ్రి పేరు తెలుసుకొని లోపలికి పంపించారు. ఈ విషయంలో నా తండ్రి పేరు వాడటం నాకు నచ్చలేదు. అసలు ఒంటరిగా గుడికి వెళ్లడం నా తప్పుడు. నేను ఉండే టౌన్ లో నాకు ఇలాంటి చేదు అనుభవం జరుగుతుందని అస్సులు ఊహించలేదు. కనీసం డ్యాన్సర్, నటి అని తెలిసి కూడా నన్ను అలా అవమానించడం చూస్తుంటే.. ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటా అని బాధ కలుగుతుందని తనకు ఎదురై చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.