Venkateswarlu
Venkateswarlu
హీరోయిన్ భావన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఆమె తీసింది మూడు, నాలుగు సినిమాలే అయినా.. తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. ఆమె మాతృభాష మలయాళంతో పాటు తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు చేశారు. 2015లో ఆమె తండ్రి బాలచంద్రన్ 2015లో అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆయన చనిపోయి ఇప్పటికి ఎనిమిది ఏళ్లు అయింది. అయినా ఆమె తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పోతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో తండ్రి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘మా నాన్న చనిపోయి ఈ సంవత్సరంతో 8 ఏళ్లు అవుతోంది. అందరూ అంటుంటారు.. కాలం అన్నిటినీ మాన్పుతుందని. కానీ, అది మనసులో గాయం లాగా అలానే ఉంటుంది. ఆ బాధ ఎప్పటికీ అలానే ఉంటుంది. బయటకు ఎంత సంతోషంగా కనిపిస్తున్నా.. లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది. ఇన్నేళ్లు గడుస్తున్నా ఆ బాధనుంచి బయట పడటం సాధ్యం కావటం లేదు. జీవితం మొత్తం మారిపోయింది. కానీ, మా నాన్న లేని లోటు నన్ను ఎప్పుడూ ఇబ్బందిపెడుతూనే ఉంటుంది.
ఈ బాధ కొన్ని సార్లు ఎక్కువగా ఉంటుంది.. కొన్ని సార్లు తక్కువగా ఉంటుంది. కానీ, అది అలానే ఉంటుంది’’ అని అన్నారు. కాగా, భావన 2008లో వచ్చిన ‘ఒంటరి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘మహాత్మ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. హీరో, నిప్పు సినిమాల్లో నటించారు. నిప్పు సినిమా తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారు. ప్రస్తుతం తమిళం, మలయాళం, కన్న భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మరి, తండ్రి మరణం గురించి చెబుతూ భావన ఎమోషనల్ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.