అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న మూవీ.. ట్రైలర్ తో మెప్పించినట్లేనా!

2007 లో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా అందరిని మెప్పించిందని చెప్పి తీరాల్సిందే. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అదే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

2007 లో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా అందరిని మెప్పించిందని చెప్పి తీరాల్సిందే. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అదే అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

తాజాగా అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అనే మూవీ ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సినిమా రిలీజ్ డేట్ కు ఇంకా చాలానే సమయం ఉంది. అయినా సరే అప్పుడే ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసేసారు. దాదాపు ఈ ట్రైలర్ లోనే కథ అంతా చెప్పేశారని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఇందులో అమీర్ ఖాన్ ఓ బాస్కెట్ బాల్ కోచ్ . అయితే తన ప్రవర్తన కారణంగా కోర్టు అతనికి ఓ విచిత్ర శిక్ష వేస్తుంది. అదేంటంటే మానసిక ఎదుగుదల లేని ఓ గ్రూప్ కు బాస్కెట్ బాల కోచింగ్ ఇవ్వడం. అది అతనికి ఇష్టంలేకపోయినా సరే ఆ బాధ్యతను తీసుకుంటాడు.ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి ? వాళ్ళకి కోచింగ్ ఇస్తాడా లేదా ? వాళ్ళు మ్యాచ్ ఆడుతారా లేదా ? అనే ప్లాట్ మీద ఈ సినిమా కొనసాగుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన తారే జమీన్ పర్, చెక్ దే ఇండియా, దంగల్ లాంటి చాలా సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. సో ఈ మూవీలో అమీర్ ఖాన్ కొత్తగా ఏమి చూపిస్తారా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాన్సెప్ట్ పరంగా కొత్తదనం ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఈ మూవీలో అమీర్ ఖాన్ యాక్షన్ కు మాత్రం ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉందని భావిస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ కు సపోర్ట్ గా ఉండే రోల్ లో జెనీలియా నటిస్తుంది. సో ప్రస్తుతానికి ట్రైలర్ పరంగా సినిమా బాగానే ఆకట్టుకుంది కానీ.. అది రిలీజ్ తర్వాత ఎంత వరకు సక్సెస్ అవుతుందనేదే అందరి అనుమానం. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ సినిమా ట్రైలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments