Tata Scholarship: విద్యార్థులకు TATA గుడ్ న్యూస్.. రూ. 12 వేల స్కాలర్‌షిప్.. ఇలా అప్లై చేసుకోండి

విద్యార్థులకు TATA గుడ్ న్యూస్.. రూ. 12 వేల స్కాలర్‌షిప్.. ఇలా అప్లై చేసుకోండి

Tata Scholarship: విద్యార్థులకు టాటా కంపెనీ తీపి కబురును అందించింది. టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం 2024-25 పేరిట పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తోంది. రూ. 12 వేల స్కాలర్ షిప్ పొందొచ్చు.

Tata Scholarship: విద్యార్థులకు టాటా కంపెనీ తీపి కబురును అందించింది. టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం 2024-25 పేరిట పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తోంది. రూ. 12 వేల స్కాలర్ షిప్ పొందొచ్చు.

ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితి బాగా లేక చదువుకు దూరమవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. డబ్బులు లేని కారణంగా చదువుకు స్వస్తి చెప్పి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించే వారు కూడా ఉన్నారు. చదువు ఒక్కటే జీవితాలను ఉన్నత స్థితికి తీసుకెళ్లగలదు. కాబట్టి అందరికి విద్యనందించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పలు స్వఛ్చంద సంస్థలు కూడా పేద విద్యార్థుల విద్యకు అయ్యే ఖర్చుల కోసం స్కాలర్ షిప్స్ ను కూడా అందిస్తున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ టాటా విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ఏకంగా 12 వేల స్కాలర్ షిప్ ను పొందొచ్చు. ఇంతకీ అర్హులు ఎవరంటే?

టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్ షిప్ ప్రోగ్రాం 2024-25 పేరిట పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ ను అందిస్తోంది. ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోసం ఈ స్కాలర్ షిప్స్ ను అందిస్తున్నది. పేద విద్యార్థులు, వెనకబడిన తరగతుల విద్యార్థులు, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి రూ. 10 వేల నుంచి 12 వేల వరకు స్కాలర్ షిప్ ప్రకటించింది. టాటా గ్రూప్‌లోని ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిటల్ లిమిటెడ్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 15 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అర్హత:

ఈ స్కాలర్ షిప్ పొందేందుకు విద్యార్థులు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పాలిటెక్నిక్ చదువుతూ ఉండాలి. కిందటి తరగతిలో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థి కుటుంబ ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. అప్లై చేసుకోదలిచిన వారు ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికేట్, కాలేజ్ అడ్మిషన్ రిషిప్ట్, బ్యాంక్ పాస్ బుక్, మార్క్స్ కార్డ్ కలిగి ఉండాలి.

ఎంపిక:

అకాడమిక్ మెరిట్, ఫైనాన్షియల్ బ్యాగ్రౌండ్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. డాక్యూమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

Show comments