P Venkatesh
Reliance foundation scholarships 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ 2024-25 ద్వారా ఉపకారవేతనాలను అందించేందుకు రెడీ అయ్యింది. ఏకంగా రూ. 2 లక్షలు పొందొచ్చు.
Reliance foundation scholarships 2024-25: విద్యార్థులకు గుడ్ న్యూస్. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ 2024-25 ద్వారా ఉపకారవేతనాలను అందించేందుకు రెడీ అయ్యింది. ఏకంగా రూ. 2 లక్షలు పొందొచ్చు.
P Venkatesh
డబ్బు లేని కారణంగా చదువుకు దూరమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక చదువుకోవాలనే ఆలోచనను ఆదిలోనే తుంచేసుకుంటున్నారు. ఏవో చిన్ని చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కాలర్ షిప్స్ అందిస్తున్నాయి. పలు ప్రైవేట్ సంస్థలు కూడా పేద విద్యార్థులు చదువుకునేందుకు ఉపకారవేతనాలను ఇస్తున్నాయి. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుకునేందుకు.. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు కూడా డబ్బు లేని కారణంగా చదువులను కొనసాగించలేకపోతున్నారా? ఉన్నత చదువులు చదువుకోవాలన్న కోరిక బలంగా ఉందా? అయితే మీకు గుడ్ న్యూస్. మీలాంటి వారికి సాయం అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రెడీ అయ్యింది.
రిలయన్స్ ఫౌండేషన్ విద్యార్థులకు తీపికబురును అందించింది. రిలయన్స్ ఫౌండేషన్ యూజీ స్కాలర్ షిప్ 2024-25 ద్వారా ఏకంగా రూ. 2 లక్షలు అందించేందుకు సిద్ధం అయ్యింది. మొత్తం 5వేల మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్ షిప్ పథకానికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. యువతను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించడానికి, ఆర్థిక భారం లేకుండా చదువులను కొనసాగించడానికి ఈ స్కాలర్ షిప్స్ అందిస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది.
దరఖాస్తు చేసుకోదలిచిన విద్యార్థులు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ మీడియట్ పాసై ఉండాలి. 2024-25 అకాడమిక్ ఇయర్ లో ఫుల్ టైమ్ డిగ్రీ కోర్సు ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం రూ. 15 లక్షలకు మించకూడదు. ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్, గతంలో విద్యార్థులు చూపిన అకాడమిక్ ప్రతిభ, తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు మొత్తం రూ. 2 లక్షల స్కాలర్ షిప్ ను అందిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 6 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ అధికారిక వెబ్ సైట్ www.scholarships.reliancefoundation.org ను పరిశీలించండి. అప్లై చేసుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ మెయిన్ పేజీలో యూజీ అప్లికేషన్ పోర్టల్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ను వదులుకోకండి. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్ షిప్ ను పొంది ఉన్నత చదువులు చదివి మీ కలలను సాకారం చేసుకోండి.