10th పాసైన వారికి లక్కీ ఛాన్స్.. ఈ ఉద్యోగాలు మీకోసమే.. మిస్ చేసుకోకండి

RCFL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

RCFL Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

పదోతరగతి అర్హతతో ఉద్యోగావకాశాలు తక్కువనే చెప్పాలి. ఈ రోజుల్లో మంచి జీతం అందుకోవాలంటే కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ ను కలిగి ఉండాలి. దీంతో పాటు స్కిల్స్ అప్ డేట్ చేసుకోవాలి. అలా అయితేనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్ పొందడం సాధ్యమవుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. వీటిల్లో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. మరి మీరు కూడా టెన్త్ పాసై ఖాళీగా ఉన్నారా? పదోతరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 165 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నది. అభ్యర్థులు 50 శాతం మార్కులతో టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి. 25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు టెక్నీషియన్స్ కు రూ. 7000-8000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ. 9000 అందిస్తారు. అర్హత, ఆసక్తి గలవారు జులై 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 165

విభాగాల వారీగా ఖాళీలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 31

టెక్నీషియన్ అప్రెంటిస్: 54

ట్రేడ్ అప్రెంటిస్: 80

విభాగాలు:

  • సెక్రటీస్ అసిస్టెంట్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, మెకానికల్, అటెండెంట్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇన్ స్ట్రూమెంట్ మెకానికల్, ల్యాబోరేటరీ అసిస్టెంట్.

అర్హత:

  • 50 శాతం మార్కులతో టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • జులై 01 వరకు 25 ఏళ్లు.

ట్రైనింగ్ పీరియడ్:

  • 2 సంవత్సరాలు

జీతం:

  • నెలకు టెక్నీషియన్స్ కు రూ. 7000-8000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ. 9000

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 19-07-2024
Show comments