10th అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్.. జస్ట్ అప్లై చేస్తే చాలు.. 56 వేల జీతం!

Jobs: పది పాసయ్యారా? మీకో గుడ్ న్యూస్.. జస్ట్ అప్లై చేస్తే చాలు గవర్నమెంట్ జాబ్ పొందవచ్చు.

Jobs: పది పాసయ్యారా? మీకో గుడ్ న్యూస్.. జస్ట్ అప్లై చేస్తే చాలు గవర్నమెంట్ జాబ్ పొందవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు హైవేలు మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport & Highways) “మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (నాన్-టెక్నికల్)” పోస్టులని భర్తీ చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి అప్లై చేస్తే చాలా ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి. వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇక ఈ పోస్ట్ కోసం మొత్తం 9 ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు కూడా అర్హులైనవారిగా ఎంపిక అవ్వవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇక ఈ పోస్టుకి అప్లై ఎంపికైన వారి పని ఏంటంటే ఇది మల్టీ టాస్కింగ్ పోస్ట్ కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలలో వివిధ పనులను చేయాలి. అక్కడ ఉద్యోగులకు హెల్పర్ గా ఉండాలి. ఇక విద్యార్హత విషయానికి వస్తే.. ఈ ఉద్యోగానికి అభ్యర్థులు కనీసం 10వ తరగతి (మేట్రిక్యులేషన్) పాసై ఉండాలి. అది కూడా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి సర్టిఫికెట్ ఉండాలి. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్ధులు దేశంలో ఎక్కడైనా కూడా పని చేసే విధంగా ఉండాలి. ఇక ఏజ్ విషయానికి వస్తే.. ఈ పోస్టుకు ఏజ్ లిమిట్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది. అంటే ఈ పోస్ట్ లకు ఏజ్ లిమిట్ 18 నుండి 25 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కూడా ఏజ్ లిమిట్ అనేది తక్కువగా ఉండొచ్చు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడం చాలా ఈజీ. అభ్యర్థులు DGR (Directorate General of Resettlement) వెబ్సైట్ ద్వారా “విల్లింగ్నెస్ ఫార్మాట్” ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని, డీటైల్స్ ఫుల్ గా ఫిల్ చేసి ఎక్సెల్ ఫార్మెట్ లో జిలా సైనిక్ బోర్డ్ లేదా రాజ్య సైనిక్ బోర్డ్ ద్వారా అప్లికేషన్ ని dgrddemp@desw.gov.in ఇమెయిల్ కి పంపవలసి ఉంటుంది.ఇక అభ్యర్థి యొక్క 10వ తరగతి సర్టిఫికెట్, ఎక్స్-సర్వీస్‌మెన్ అయితే అతని హోదా గురించి సర్టిఫికేట్, అభ్యర్ధి యొక్క పాస్‌పోర్టు సైజు ఫోటోలు వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ప్రాసెస్ లో అన్నీ వివరాలు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫిల్ చేయాలి. అలా చేస్తేనే సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

అప్లికేషన్ పంపడానికి 22 నవంబర్ 2024 చివరి తేదీ. దీనికి రాత రాత పరీక్ష ఉంటుందని నోటిఫికేషన్ లో ఎక్కడా మెన్షన్ చేసి లేదు. అందువల్ల రాత పరీక్ష ఉండే అవకాశం లేదు. ఒకవేళ సెలెక్షన్ ప్రాసెస్ లో ఏమైనా అవసరం అనుకుంటే రాత పరీక్ష పెట్టవచ్చు. సొ దీన్ని బట్టి వీటికి జస్ట్ అప్లయ్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ మెయిల్ పంపితే చాలు మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు 18000/- నుంచి 56900/- వరకు జీతం ఉంటుంది. ఇంకా అలాగే ప్రభుత్వం నుంచి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి కచ్చితంగా అప్లయ్ చేసుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.  పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

Show comments