Vinay Kola
ITBP: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీబీపి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు కేవలం టెన్త్ అర్హత ఉంటే చాలు.
ITBP: కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీబీపి నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులకు కేవలం టెన్త్ అర్హత ఉంటే చాలు.
Vinay Kola
చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కల. అందులోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారు? ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు ఏంటి? అప్లికేషన్ ఫీజు ఎంత? వీటిని ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కేంద్ర ప్రభుత్వం నుంచి తాజాగా విడుదల అయిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 545 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మొత్తం పోస్టులలో యూఆర్ కేటగిరీలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఈ కేటగిరీలో ఏకంగా 209 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్సీ కేటగిరీలో 77 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 40 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 164 పోస్టులు ఇంకా అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 55 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్ నుంచి టెన్త్ అర్హత కలిగిన వారు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని టెస్టులు మాత్రం కచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఈ పోస్టులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రిటన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ టెస్టులు ఉంటాయి. వీటి ఆధారంగా ఐటీబీపీ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వీటికి ఆసక్తి కలిగిన అభ్యర్థులు కచ్చితంగా ఆ టెస్టులను క్లియర్ చేయాలి.
ఇక ఈ పోస్టుల ధరఖాస్తుకు చివరి తేదీ విషయానికి వస్తే.. అభ్యర్ధులు నవంబర్, 2024 6వ తేదీలోగా ఈ కానిస్టేబుల్ (డ్రైవర్) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్ధులకు మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో పాటుగా కచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే తప్పని సరిగా 21 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే.. యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన వారు అయితే రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు మాత్రం ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి అన్నీ టెస్టులు క్వాలిఫై అయ్యాక ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అన్ని టెస్టుల్లో పాసై వీటికి ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 దాకా జీతం ఇస్తారు. అలాగే ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా సదుపాయాలు ఉంటాయి. కాబట్టి ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 6 లోగా అప్లై చేసుకోండి. వీటికి https://recruitment.itbpolice.nic.in/rect/index.php వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు.ఇక తాజాగా విడుదల అయిన ఈ ITBP పోస్టులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.