రైల్వే జాబ్ మీ లక్ష్యమా?.. 1,785 జాబ్స్ రెడీ.. మిస్ చేసుకోకండి

RRC SER Kolkata Apprentice 2024: రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే 1785 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండానే సొంతం చేసుకోవచ్చు.

RRC SER Kolkata Apprentice 2024: రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే 1785 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. రాత పరీక్ష ఇంటర్వ్యూ లేకుండానే సొంతం చేసుకోవచ్చు.

భారతీయ రైల్వే ఆసియా ఖండంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ను కలిగి ఉన్నది. వస్తు రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నది. వర్తక వ్యాపారంలో రైల్వేల సేవలు మరువలేనివి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేరవేస్తూ ఆదరణ పొందింది. రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకుంటున్నది. దీని కోసం రైల్వేలో అవసరమైన సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తోంది. లోకో పైలట్, అసిస్టెంట్ లోకోపైలట్, క్లర్క్, స్టేషన్ మేనేజర్, గూడ్స్ గార్డ్, అప్రెంటిస్ పోస్టులను వేల సంఖ్యలో భర్తీ చేస్తున్నది. రైల్వేలో జాబ్ కోసం ట్రై చేస్తున్నవారికి ఇదే మంచి ఛాన్స్.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. అయితే రైల్వే ఉద్యోగాలకు రాత పరీక్షలు, ఇంటర్వ్యలు తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. కొన్ని ఉద్యోగాలకు ఎలాంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఉద్యోగాలనే అప్రెంటిస్ పోస్టులు. రైల్వేలో అలాంటి జాబ్స్ కు జస్ట్ అప్లై చేస్తే చాలు జాబ్ పొందొచ్చు. డిగ్రీ అవసరం లేకుండానే రైల్వే జాబ్ దక్కించుకోవచ్చు. మీరు రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లైతే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. తాజాగా కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ – సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది.

వంద, రెండు వందలు కాదు ఏకంగా 1,785 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎస్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోదలిచిన వారు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ పోస్టులకు టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. నవంబర్ 28 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 27 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే అధికారిక వెబ్ సైట్ www.rrcser.co.in ను పరిశీలించాల్సి ఉంటుంది.

Show comments