కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్స్.. ఈ అర్హతలున్న వారికి వరం.. వెంటనే అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర విద్యుత్ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్ష 20 వేల జీతం పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర విద్యుత్ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్ష 20 వేల జీతం పొందొచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

అటు దేశంలో ఇటు రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. ప్రభుత్వ సంస్థల నుంచి జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. రైల్వేలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, విద్యుత్ సంస్థలు, ఆయిల్ కంపెనీలు, బొగ్గుగనులు ఇలా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. నిరుద్యోగులకు జాబ్ కొట్టేందుకు ఇదే సరైన సమయం. జాబ్ లేదని వర్రీ అవుతున్న వారు ఈ జాబ్స్ కు ట్రై చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తాజగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 50 సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మరి మీరు నిరుద్యోగులుగా మిగిలిపోకూడదంటే ఈ జాబ్స్ ను అస్సలు వదలకండి. కేంద్ర విద్యుత్ సంస్థలో జాబ్ కొట్టే ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. సెంట్రల్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు.. ఎప్పటి నుంచో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు పోటీపడే వారు 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిగ్రీ అంటే.. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్, ప్రొడక్షన్, ఇన్ స్ట్రుమెంటేషన్ కోర్సుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ కలిగి ఉండాలి. దీనితోపాటు డిప్లొమా లేదా అడ్వాన్స్డ్ డిప్లొమా లేదా పీజీ డిప్లొమా పాసై ఉండాలి. అభ్యర్థులు 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు.. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయోసడలింపు ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల విద్యార్హతలు, అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌/ స్క్రీనింగ్‌, రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల – రూ.1 లక్ష 20 వేల వరకు జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 26 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోదలిచిన వారు పూర్తి వివరాలకు ntpc అధికారిక వెబ్ సైట్ ntpc.co.in ను సందర్శించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న వారు ఎన్టీపీసీ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలను మిస్ చేసుకోకండి. నెలకు లక్ష 20 వేల వరకు జీతం ఉండే ఈ జాబ్స్ ను సాధిస్తే లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.

Show comments