రాత పరీక్ష లేకుండానే Govt జాబ్స్.. నెలకు లక్ష పైనే జీతం.. అర్హులు వీరే

FSSAI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు.

FSSAI Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు.

ఇటీవల పలు శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదే మంచి సమయం. లక్షల జీతాలతో కూడిన ఈ ఉద్యోగాలను సాధిస్తే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. రైల్వే, భారత త్రివిధ దళాలు, బ్యాంకు జాబ్స్ వంటివి వేల సంఖ్యలో ఉన్నాయి. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు లక్షకుపైగానే జీతం పొందొచ్చు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 11 పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ 5, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 6 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. 45 ఏళ్లు పైబడిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జూలై 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 11

అర్హత:

  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. దీతో పాటు సంబంధిత విభాగంలో పనిచేసిన అనుభవం ఉండాలి. అదేవిధంగా,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్ కోసం అభ్యర్థి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రెండు పోస్టులకు అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఎలాంటి రాత పరీక్షలేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు ఎంపికైన వ్యక్తికి పే లెవెల్-10 కింద నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం అందిస్తారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు లెవెల్-8 కింద నెలకు రూ. 51,100 వరకు జీతం అందుతుంది.

దరఖాస్తు విధానం:

  • ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ అప్లికేషన్‌తో పాటు ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా చేయవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తును అసిస్టెంట్ డైరెక్టర్, ఎఫ్ఎస్ఎస్ఐ ప్రధాన కార్యాలయం, మూడవ అంతస్తు, ఎఫ్డీఏ భవన్,కోట్లా రోడ్, న్యూ ఢిల్లీ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది.

దరఖాస్తు చివరి తేదీ:

  • 29-07-2024
Show comments