iDreamPost
android-app
ios-app

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

  • Published Nov 24, 2023 | 12:46 PM Updated Updated Nov 24, 2023 | 12:46 PM

నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యూలర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రెగ్యూలర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం!

ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించడం చేస్తుంటాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలో పేదలకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనిలో భాగంగా ఆరోగ్య సురక్ష అనే పథకాన్ని ప్రవేశపెట్టింది జగన్ సర్కార్. అనారోగ్యాలకు గురై వైద్య ఖర్చులు భరించలేక అప్పులపాలవుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతోంది. దీనిలో భాగంగానే అవసరమైన వైద్య సిబ్బందిని నియమించేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది.

ఏపీలో ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసింది ప్రభుత్వం. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే ఈ పోస్టులను వాకిన్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ రెగ్యులర్ /కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భ‌‌‌‌ర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • గైనకాలజీ – 12
  • అనస్థీషియా – 15
  • పీడియాట్రిక్స్ – 11
  • జనరల్ మెడిసిన్- 37
  • సాధారణ శస్త్రచికిత్స- 03
  • ఆర్థోపెడిక్స్ – 01
  • నేత్ర వైద్యం – 10
  • రేడియాలజీ – 38
  • పాథాలజీ – 02
  • ఈఎన్టీ- 07
  • డెర్మటాలజీ – 11
  • మనోరోగచికిత్స- 01
  • ఫోరెన్సిక్ మెడిసిన్- 02

విద్యార్హతలు:

  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పోస్టులకు వాకిన్ ఇంటర్య్వూకి హాజరయ్యే అభ్యర్థులు మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా డిప్లొమా, డీఎన్ బీ కలిగి ఉండాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయసు నిబంధనలు:

  • అభ్యర్థులు 42 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్య్లూఎస్ వారికి వయసు సడలింపు ఉంటుంది.

వేతనం:

  • కాంట్రాక్ట్ పద్దతిలో ఎంపికైన వారికి ట్రైబల్ ఏరియాలో రూ. 2,50,000 చెల్లిస్తారు. రూరల్ ఏరియాలో రూ. 2,00,000, అర్భన్ ఏరియాలో రూ. 1, 30,000 చెల్లిస్తారు.
  • రెగ్యూలర్ వారికి రూ. 61,960 నుంచి రూ. 1, 51 370 వేతనం చెల్లిస్తారు.

వాకిన్ రిక్రూట్ మెంట్ వివరాలు :

  • డిసెంబర్ 11న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ ,డెర్మటాలజీ , ఫొరెన్సిక్ సైన్స్ పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంది.
  • డిసెంబర్ 13న గైనకాలజీ ,అనస్థీషియా,ఈఎన్టీ, పెథాలజీ పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంది.
  • డిసెంబర్ 15న పీడియాట్రిక్స్ , ఆర్థోపిడిక్స్ , ఆప్తాల్మాలజీ , రేడియాలజీ , సైకియాట్రీ పోస్టులకు వాకిన్ రిక్రూట్మెంట్ ఉంటుంది.

సమయం :

  • ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.

వేదిక :

  • వాకిన్ రిక్రూట్మెంట్ వేదిక గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, 77-2/జి, లక్ష్మీ ఎలైట్ బిల్డింగ్, పాతూరు రోడ్ చిరునామాలో ఉంటుందని ఎపిఎంఎస్ఆర్బీ మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

అధికారిక వెబ్ సైట్

http://hmfw.ap.gov.in