Virat Kohli Is Really Fuels His Passion Dinesh Karthik: కోహ్లీని రెచ్చగొడితే నరకం చూపిస్తాడు.. ఎవర్నీ వదలడు: స్టార్ క్రికెటర్

కోహ్లీని రెచ్చగొడితే నరకం చూపిస్తాడు.. ఎవర్నీ వదలడు: స్టార్ క్రికెటర్

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జోలికి వెళ్లొద్దని అంటున్నాడో స్టార్ క్రికెటర్. అతడ్ని రెచ్చగొడితే నరకం చూపిస్తాడంటూ వార్నింగ్ ఇస్తున్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జోలికి వెళ్లొద్దని అంటున్నాడో స్టార్ క్రికెటర్. అతడ్ని రెచ్చగొడితే నరకం చూపిస్తాడంటూ వార్నింగ్ ఇస్తున్నాడు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పుడు భీకర ఫామ్​లో ఉన్నాడు. గతేడాది ఆసియా కప్, ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్​లో అదరగొట్టాడు కింగ్. అదే ఫామ్​ను ఇతర సిరీస్​ల్లోనూ కంటిన్యూ చేస్తూ పోయాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2024లోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆర్సీబీని ఛాంపియన్​గా నిలిపేందుకు తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఆడిన 15 మ్యాచుల్లో 154 స్ట్రైక్ రేట్​తో 741 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు బాదాడు. అతడు ఎంత ప్రయత్నించినా బెంగళూరు ప్లేఆఫ్స్​కే పరిమితమైంది. కప్పు మిస్సైన కసిలో ఉన్న కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్​పై కన్నేశాడు. మెగా టోర్నీలో పరుగుల వర్షం కురిపించి భారత్​ను విజేతగా నిలబెట్టాలని చూస్తున్నాడు.

ప్రపంచ కప్​కు కోహ్లీ సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో అతడి గురించి స్టార్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. విరాట్​ను రెచ్చగొడితే నరకం చూపిస్తాడని హెచ్చరించాడు. అతడి జోలికి వెళ్తే ఎవర్నీ వదలడని వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్​లో అతడ్ని రెచ్చగొట్టినందుకు ఏం చేశాడో అందరూ చూశారుగా అని చెప్పాడు. తనను విమర్శించే వాళ్లు, తన గురించి చెడుగా మాట్లాడే వారి నోళ్లను మూయించడం అంటే కింగ్​కు ఎంతో ఇష్టమన్నాడు డీకే. కోహ్లీ అగ్నిగోళం లాంటి వాడని.. అతడి దగ్గరకు వెళ్తే కాలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించాడు. కార్తీక్ ఈ కామెంట్స్ చేయడం వెనుక ఓ రీజన్ ఉంది. ఈ ఏడాది ఐపీఎల్​లో కోహ్లీ బ్యాట్​తో విధ్వంసం సృష్టించాడు.

కోహ్లీ పరుగుల వరద పారించినా సునీల్ గవాస్కర్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు అతడి స్ట్రైక్ రేట్​ మీద విమర్శలు చేశారు. స్లోగా ఆడుతున్నాడని, ఇలాగైతే కప్పు కష్టమంటూ విమర్శలు చేశారు. దీనిపై అప్పట్లో మాటలతో పాటు బ్యాట్​తోనూ జవాబిచ్చాడు కింగ్. క్రమంగా గేర్లు మార్చి వేగంగా పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే డీకే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘కోహ్లీ ఎంతో ప్యాషన్ ఉన్న ప్లేయర్. తనను విమర్శించే వారి నోళ్లు మూయించడం అతడికి ఇష్టం. అతడో మండే అగ్నిగోళం లాంటోడు. దగ్గరకు వెళ్తే కాలిపోతారు. ఈ ఐపీఎల్​లో సైమన్ డౌల్ వంటి కొందరు అతడ్ని రెచ్చగొట్టారు. దీంతో అతడు బ్యాట్​తో విధ్వంసం సృష్టించాడు. విరాట్​లోని ఈ యాంగిల్​ను ఎవరూ తట్టుకోలేరు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్​లో అతడు ఆడిన తీరుపై ఓ పుస్తకమే రాయొచ్చు’ అని డీకే చెప్పుకొచ్చాడు. మరి.. విరాట్​ను రెచ్చగొట్టొద్దంటూ కార్తీక్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments