Nidhan
ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్‌లో చెత్త బౌలింగ్‌తో విమర్శలపాలయ్యాడు మిచెల్ స్టార్క్. 25 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాడని.. ఇలాంటోడు టీమ్‌లో ఉండటం దండగ అని ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌తో అతడు హీరో అయిపోయాడు.
ఐపీఎల్-2024 గ్రూప్ స్టేజ్‌లో చెత్త బౌలింగ్‌తో విమర్శలపాలయ్యాడు మిచెల్ స్టార్క్. 25 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నాడని.. ఇలాంటోడు టీమ్‌లో ఉండటం దండగ అని ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్‌తో అతడు హీరో అయిపోయాడు.
Nidhan
ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు మిచెల్ స్టార్క్. మినీ ఆక్షన్‌లో అతడి కోసం ఎన్నో జట్లు పోటీపడ్డాయి. కానీ ఏకంగా రూ.25 కోట్ల భారీ ధర చెల్లించి మరీ సొంతం చేసుకుంది కోల్‌కతా నైట్ రైడర్స్. గత కొన్ని సీజన్లుగా సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదు కేకేఆర్. దీంతో ఆ టీమ్ రాత మార్చేస్తాడని స్టార్క్‌పై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ గ్రూప్ స్టేజ్‌లో చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడతను. 25 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. వికెట్లు తీయకపోగా.. భారీగా రన్స్ లీక్ చేస్తూ జట్టుకు భారం అయ్యాడు. దీంతో అతడు టీమ్‌లో ఉండటం దండగ అని విమర్శలు వచ్చాయి. అయినా గంభీర్ అతడ్ని కంటిన్యూ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని స్టార్క్ వమ్ము చేయలేదు.
ఈ సీజన్లో తన మీద వస్తున్న విమర్శలకు ఒక్క మ్యాచ్‌తో చెక్ పెట్టాడు స్టార్క్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్స్-1లో 3 వికెట్లతో చెలరేగాడీ ఆసీస్ స్పీడ్‌స్టర్. ఒక్క మ్యాచ్‌తో అతడు హీరో అయిపోయాడు. డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సహా నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ వికెట్లు తీశాడు స్టార్క్. దీంతో ఎస్ఆర్హెచ్ కోలుకోలేకపోయింది. స్టార్క్ సూపర్ స్పెల్‌తో మ్యాచ్‌పై పట్టు బిగించిన కోల్‌కతా.. మ్యాచ్ ఆసాంతం దాన్నే కంటిన్యూ చేసి విక్టరీ కొట్టింది. నిన్నటి మ్యాచ్‌లో హెడ్‌ను స్టార్క్ ఔట్ చేసిన తీరు హైలైట్‌గా మారింది. భీకర ఫామ్‌లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్‌ను ఇన్నింగ్స్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు స్టార్క్. అద్భుతమైన ఔట్ స్వింగ్ డెలివరీతో అతడి ఆటకట్టించాడు. ఇన్నాళ్లూ ఫెయిలైన స్టార్క్.. నిన్న అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఎవరూ నమ్మలేకపోతున్నారు.
ఈ సీజన్ మొత్తం దారుణంగా బౌలింగ్ చేసిన స్టార్క్.. మళ్లీ ఫామ్ అందుకోవడానికి హెడ్ కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీళ్లిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉండటమే దీనికి కారణమని వినిపిస్తోంది. ఈ ఇద్దరు ఆసీస్ స్టార్లు దేశానికి కలసి ఆడతారు. కానీ బయటకు కనిపించని రైవల్రీ వీళ్ల మధ్య చాన్నాళ్లుగా ఉందని తెలుస్తోంది. అయితే అది గ్రౌండ్‌కే పరిమితమట. గతంలో పలు లీగ్స్‌తో పాటు ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీల్లో స్టార్క్-హెడ్ ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారట. నెట్టింట వైరల్ అవుతున్న పాత వీడియోలు చూస్తే హెడ్‌ను ఔట్ చేయడం స్టార్క్‌కు అలవాటుగా మారినట్లు కనిపిస్తోంది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ వీక్నెస్ తెలుసు, ఎలాంటి బంతిని వేస్తే అతడి ఆటకట్టించొచ్చు తెలుసు కాబట్టే మళ్లీ ఫామ్‌లోకి రావడానికి నిన్నటి మ్యాచ్‌ను స్టార్క్ ఉపయోగించుకున్నాడని తెలుస్తోంది. హెడ్‌తో ఉన్న కోల్డ్ వార్ తనకు మంచే చేసిందని అతడు భావిస్తున్నాట. మరి.. హెడ్-స్టార్క్ రైవల్రీపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.