Somesekhar
హార్దిక్ కు మండిపోయేలా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ బ్యాటర్, సిక్సర్ల వీరుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ. ఇంతకీ అతనేమన్నాడు అంటే?
హార్దిక్ కు మండిపోయేలా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ బ్యాటర్, సిక్సర్ల వీరుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ. ఇంతకీ అతనేమన్నాడు అంటే?
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ వస్తోంది. ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ గా ఐదుసార్లు ట్రోఫీని అందించిన రోహిత్ శర్మను కాదని, హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చారు. దీంతో ముంబై టీమ్ లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. అందుకు సూర్యకుమార్ పెట్టిన పోస్టే నిదర్శనమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. హార్దిక్ కు మండిపోయేలా రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా మాజీ బ్యాటర్, సిక్సర్ల వీరుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ క్రికెటర్, పోలిటిషియన్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ. తాజాగా స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్దూ రోహిత్ లీడర్ షిప్ గురించి మాట్లాడుతూ..”రోహిత్ శర్మ ఓ సింహం లాంటోడు.. అతడు సింహాల గుంపుకే రాజు. అడవికి లయన్ ఎలా కింగో.. రోహిత్ కూడా అలాగే. ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి కెప్టెన్ లేడనే చెప్పాలి. వంద సింహాలు ఎదురొచ్చినా.. వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగే కింగ్” అంటూ కితాబిచ్చాడు సిద్దూ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
కాగా.. సిద్దూ కామెంట్స్ హార్దిక్ పాండ్యాకు మండేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ సింహం అయితే.. మరి హార్దిక్ పాండ్యా ఏంటి? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ముంబై ఆటగాళ్లు ప్రాక్టీస్ లో నిమగ్నమైయ్యారు. కానీ అక్కడి వర్గాల సమాచారం ప్రకారం ముంబై ఆటగాళ్లలో సఖ్యత కుదరడం లేదంట. అందుకే సూర్యకుమార్ అలాంటి పోస్ట్ పెట్టాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. ముంబై కప్ కొట్టడం కష్టమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Navjot Singh Sidhu talking about Rohit Sharma’s leadership qualities. 👏 (Video – Star Sports). pic.twitter.com/yw9jNzZEVJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024
ఇదికూడా చదవండి: IPL 2024.. RCBకి ధోని హెచ్చరిక.. ఫస్ట్ మ్యాచ్ కి ముందే ఏమైందంటే?