హార్దిక్-నటాషా విడాకుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్.. పిచ్చోళ్లను చేశారా?

టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఆట వల్ల కాదు.. భార్య నటాషాతో విడాకుల అంశంతో అతడు వైరల్ అవుతున్నాడు. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.

టీమిండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఆట వల్ల కాదు.. భార్య నటాషాతో విడాకుల అంశంతో అతడు వైరల్ అవుతున్నాడు. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.

టీమిండియా సీమ్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఆట వల్ల కాదు.. భార్య నటాషా స్టాంకోవిక్​తో విడాకుల వ్యవహారం వల్ల అతడు పాన్ ఇండియా లెవల్​లో వైరల్ అవుతున్నాడు. హార్దిక్-నటాషా డివోర్స్ తీసుకోవడం ఖాయమని.. భరణం కింద తన ఆస్తిలో 70 శాతాన్ని స్టాంకోవిక్​కు పాండ్యా ఇవ్వనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తమ బంధానికి వాళ్లు ఫుల్​స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యారని పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఫిట్​నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్​తో కలసి నటాషా కనిపించింది. దీంతో హార్దిక్​కు డివోర్స్ ఇచ్చి.. అలెక్స్​తో కొత్త లైఫ్​ను ఆమె స్టార్ట్ చేయనుందంటూ ఏవేవో రూమర్లు వస్తున్నాయి. ఈ టైమ్​లో హార్దిక్-నటాషా విడాకుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్.

విడాకుల వ్యవహారంపై ఇటు హార్దిక్ గానీ అటు నటాషా గానీ అధికారికంగా స్పందించలేదు. అయినా డివోర్స్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. రెడ్డిట్​లో ట్రెండింగ్ అవుతున్న ఈ పోస్ట్​ను చూసినవాళ్లు గందరగోళానికి లోనవుతున్నారు. ఈ పోస్ట్​తో మరో కోణం వెలుగులోకి వచ్చింది. హార్దిక్-నటాషా డివోర్స్ మ్యాటర్ కేవలం పబ్లిసిటీ స్టంటేనట. ముంబై ఇండియన్స్ కెప్టెన్​గా, ప్లేయర్​గా ఐపీఎల్​లో హార్దిక్ దారుణంగా విఫలమవడంతో అందరి దృష్టిని మరల్చడానికే విడాకుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఇలా ప్లాన్ చేశారని.. దీంట్లో భాగంగానే హార్దిక్, నటాషా ఇప్పటిదాకా డివోర్స్ గురించి మాట్లాడలేదని ఆ పోస్ట్​లో రాసి ఉంది.

హార్దిక్-నటాషా విడాకుల వ్యవహారంలో మరో కోణాన్ని వెల్లడించిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది పాండ్యా దంపతుల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గానీ చెప్పలేం. ఈ పోస్ట్ గురించి తెలిసిన నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారా అని ఫైర్ అవుతున్నారు. ఇక, ఐపీఎల్-2024 ముగిసిపోవడంతో హార్దిక్ టీ20 వరల్డ్ కప్-2024కు సిద్ధమవుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్​లో అతడు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, బౌలింగ్​లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచుల్లో అతడు 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్​లో 10.75 ఎకానమీతో పరుగులు ఇచ్చుకొని, 11 వికెట్లే తీయగలిగాడు. దీంతో మెగా టోర్నీలో అతడు ఎలా ఆడతాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ఒకవైపు ఐపీఎల్ ఫెయిల్యూర్, మరోవైపు విడాకుల వ్యవహారం నేపథ్యంలో భారత జట్టులో మిగతా ఆటగాళ్ల కంటే హార్దిక్ పెర్ఫార్మెన్స్ మీదే అందరి ఫోకస్ నెలకొంది. మరి.. పాండ్యా డివోర్స్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments