Kevan Parekh: యాపిల్ కొత్త సీఎఫ్ఓగా భారత సంతతి వ్యక్తి కెవిన్ పరేఖ్

Kevan Parekh The Indian-Origin Man Who Plays Key Role In Apple: ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వ్యక్తులు, భారతీయులు దిగ్గజ కంపెనీల్లో ఉన్నతమైన హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఏరి కోరి మరీ యాపిల్ కంపెనీ భారతీయ మూలాలున్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించింది.

Kevan Parekh The Indian-Origin Man Who Plays Key Role In Apple: ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన వ్యక్తులు, భారతీయులు దిగ్గజ కంపెనీల్లో ఉన్నతమైన హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఏరి కోరి మరీ యాపిల్ కంపెనీ భారతీయ మూలాలున్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించింది.

యాపిల్ కంపెనీ కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా (సీఎఫ్ఓ) భారత సంతతి ఇంజనీర్ అయిన కెవిన్ పరేఖ్ ని నియమించింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా ఉన్న లూకా మైస్ట్రిని కార్పొరేట్ సర్వీసెస్ టీమ్స్ కి బదిలీ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుతో యాపిల్ కంపెనీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కెవిన్ పరేఖ్ సీఎఫ్ఓగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. 2025 జనవరి 1న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా కెవిన్ పరేఖ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ లో చేరనున్నారు. యాపిల్ కంపెనీలో 11 ఏళ్లుగా పరేఖ్ పని చేస్తున్నారు. కంపెనీలో ఫైనాన్షియల్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. దీంతో ఇప్పుడు ఈ కెవిన్ పరేఖ్ ఎవరు అనే చర్చ నడుస్తోంది. 

మిచిగాన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పూర్తి చేశారు కెవిన్. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బిజినెస్ స్కూళ్లలో ఒకటైన చికాగో యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. 11 ఏళ్ల క్రితం యాపిల్ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా చేరిన కెవిన్.. కంపెనీలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు. కంపెనీ ఫైనాన్స్ లీడర్ షిప్ టీమ్ లో ఒక భాగమైపోయారు. ప్రస్తుతం కంపెనీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కెవిన్.. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్, జీ&ఏ, బెనిఫిట్స్ ఫైనాన్స్, ఇన్వెస్టర్ రిలేషన్స్, మార్కెట్ రీసెర్చ్ వంటి క్లిష్టమైన విభాగాలను పర్యవేక్షిస్తుంటారు. టిమ్ కుక్ కి నివేదికలు కూడా ఇస్తారని అంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ కాకముందు వరల్డ్ వైడ్ సేల్స్, రీటెయిల్, మార్కెటింగ్ విభాగాల్లో వైవిధ్యమైన స్కిల్స్ ని కనబరిచారు.

కంపెనీ విభిన్న వ్యాపార విభాగాలపై లోతైన అవగాహనను ప్రదర్శించారు. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం.. కెవిన్ ని తన సీనియర్ అయిన లూకా మైస్ట్రినే గత కొన్ని నెలలుగా సీఎఫ్ఓ హోదా కోసం తీర్చిదిద్దుతున్నారు. యాపిల్ కంపెనీలో చేరక ముందు పరేఖ్ థామ్సన్ రాయిటర్స్ అండ్ జనరల్ మోటార్స్ కంపెనీల్లో ఉన్నతమైన కెరీర్ ని నిర్మించుకున్నారు. రాయిటర్స్ కంపెనీలో నాలుగేళ్లు పని చేశారు. కార్పొరేట్ ట్రెజరర్ గా సైనాఫ్ చేసే ముందు ఫైనాన్స్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. న్యూయార్క్ జనరల్ మోటార్స్ ఆఫీసులో బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అలానే జ్యూరిచ్, యూరప్ లలో రీజనల్ ట్రెజరర్ గా పని చేశారు. దశాబ్దకాలంగా యాపిల్ కంపెనీని లోపల, బయటా పూర్తిగా అర్థం చేసుకున్నారు కెవిన్. ఈ కారణంగానే టిమ్ కుక్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలివితేటలూ, తెలివైన తీర్పు, ఫైనాన్షియల్ బ్రిలియన్స్ వంటివి యాపిల్ కంపెనీ సీఎఫ్ఓ పదవికి పర్ఫెక్ట్ ఛాయిస్ అని టిమ్ కుక్ అభివర్ణించారు. 

Show comments