Fruits: ఆపిల్ vs జామ.. రెండిట్లో ఏ పండు బెటర్! అంతా బిజినెస్ మోసం!

Fruits: పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాంటి పండ్లలో యాపిల్, జామ కాయ ముందు వరసలో ఉంటాయి..

Fruits: పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాంటి పండ్లలో యాపిల్, జామ కాయ ముందు వరసలో ఉంటాయి..

పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్ని పండ్లు మాత్రం బాగా సేల్ అవుతాయి. మనకు పండ్ల షాపులో అన్నిటికంటే ఎక్కువ అట్రాక్ట్ చేసే పండ్లు ఏవంటే యాపిల్ పండ్లు. యాపిల్ పండ్లకి మామూలుగా డిమాండ్ ఉండదు. ఇవి చూడటానికి ఎర్రగా నిగనిగలాడుతూ చూస్తే కోరుక్కు తినేలా ఉంటాయి. అంటే అంత అందంగా కనిపిస్తాయి. అంతకంటే రుచిగా కూడా ఉంటాయి. పైగా వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు ఉంటాయి. అందుకే రోజుకి ఒక యాపిల్ తింటే ఇక డాక్టర్ దగ్గరకి వెళ్లాల్సిన పనిలేదని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అంటే దీన్ని తింటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు అని అర్ధం. అది ముమ్మాటికీ నిజమే. అందుకే మిగతా పళ్ళతో పోల్చితే దీని రేటు డబుల్ ఉంటుంది. అయితే దీనికంటే తక్కువ ధరలో ఎక్కువ ఆరోగ్య పోషకాలు కలిగిన పండు కూడా ఒకటి ఉంది. అదే జమపండు. కానీ దీన్ని కేవలం సాధారణ పండు లాగానే చూస్తారు కానీ యాపిల్ కి ఇచ్చే మర్యాద ఇవ్వరు. జామకాయలు ఏడాదంతా పుష్కలంగా లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ ఇంటి దగ్గర జామ చెట్టు కామన్‌గా ఉంటుంది. అందువల్ల జామకాయ అనగానే మనలో తక్కువ ఫీలింగ్ కలుగుతుంది. అయితే యాపిల్స్ చెట్లు ఇక్కడ పెద్దగా పెరగవు. కాబట్టి మనకు పెద్దగా అందుబాటులో ఉండవు. అందువల్ల యాపిల్స్‌కి మనం ఎక్కువ విలువ ఇస్తాం.అంటే జామకాయల కంటే యాపిల్స్ ఎక్కువ ఆరోగ్యకరం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న విషయాలు తెలిస్తే కచ్చితంగా మీ అభిప్రాయం మారుతుంది.

నిజమే యాపిల్ తింటే కోట్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి యాపిల్‌లో కంటే.. జామకాయల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ C… ఆరెంజ్‌లో కంటే జామలో 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే పైనాపిల్‌లో కంటే జామలో ప్రోటీన్ 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక ఫైబర్ 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే టమాటాలో కంటే 2 రెట్లు ఎక్కువగా లైకోపీన్ ఉంటుంది. అరటిలో కంటే ఎక్కువ పొటాషియం జామలో ఉంటుంది. ఈ కారణాలు చాలవా జామ పండు రేంజ్ ఇది అని చెప్పడానికి.. యాపిల్ కంటే గ్రేట్ అని చెప్పడానికి..పైగా దీని రేటు యాపిల్ తో పోలిస్తే చాలా తక్కువ. పేద వాడి నుంచి ఉన్నోడి దాకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో దొరికే ఏకైక పండు జామ పండు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామకాయల్ని మనం గర్వంగా, గొప్పగా చెప్పుకొని తినవచ్చు.100 గ్రాముల జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు 500 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇన్ని గుణాలు మనకు ఏ పండులో ఉండవు. పైగా మనం చాలా గొప్పగా చెప్పుకునే యాపిల్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ జమ కాయలో కేవలం 4వ వంతు మాత్రమే ఉంటాయి. అందుకే జామను సూపర్ ఫుడ్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. జామకాయలు… డయాబెటిస్‌ను ఈజీగా కంట్రోల్‌లో ఉంచగలవు. దీన్ని తినడం వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. అలాగే ఇందులో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు జామకాయల్ని తింటే ఈజీగా స్లిమ్ అవ్వొచ్చు. ఎందుకంటే ఇందులోని ఫైబర్.. ఎక్కువ ఆకలి కాకుండా కంట్రోల్ చేస్తుంది.

ఒక్క ఆరోగ్యానికే కాదు అందానికి కూడా జామ వారధిగా చెప్పుకోవచ్చు. మెరిసే చర్మం కావాలనుకునేవారికి జామకాయ చాలా బెస్ట్. ఎందుకంటే ఇందులోని విటమిన్ A, లైకోపీన్, బీటా-కెరోటిన్ త్వరగా ముసలితనాన్ని రానివ్వవు. చర్మంపై ముడతలను పోగొట్టగలవు. జామలోని B3, B6 విటమిన్లు.. రక్త ప్రసరణను పెంచుతాయి..అందువల్ల హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. ఇవి మన బ్రెయిన్ బాగా పనిచేసేలా చేస్తాయి. అందువల్ల ఎలాంటి జుట్టు సమస్యలు రావు. అలాగే చాలా మందికి విపరీతంగా మొటిమలు వస్తాయి. దానికి మలబద్ధకం కూడా ఒక ప్రధాన కరణమే. ఎందుకంటే బాడీలో ఉన్న మాలినాలు ఎప్పటికప్పుడు బయటకి పోవాలి. అలా పోతే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యను జామ చాలా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే జామలోని తాజా దనం నోటి దుర్వాసనని కూడా తగ్గిస్తుంది. జామలో విటమిన్ C ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, దగ్గును ఈజీగా తగ్గిస్తుంది. మన బాడీకి కావాల్సిన కొల్లాజెన్‌ ప్రోటీన్‌ను జామ ఇస్తుంది. ఇంకా గర్భిణీలకు జామ చాలా మంచిది. ఎందుకంటే ఇందులోని ఫోలిక్ యాసిడ్ (విటమిన్ B9), ఐరన్.. బిడ్డకు చాలా మంచిది. అలాగే గుండెకు జామకాయలు చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో పొటాషియం ఉంటుంది.జామ కాయలు నోట్లో పుండ్లను తగ్గిస్తాయి. మన శరీరంలో వేడిని తగ్గించి కూల్ చేస్తాయి.. రక్తపోటు (BP)ని కూడా తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న జామని వదిలి ఎక్కువ రేటు పెట్టి ఎక్కడో కాశ్మీర్ నుంచి దిగుమతి అవుతున్న యాపిల్ కే ఎక్కువ వాల్యు ఇస్తున్నాం. దాన్ని వ్యాపారస్తులు క్యాష్ చేసుకొని ఎక్కువ రేట్లతో యాపిల్ ని అమ్మేస్తున్నారు. అంటే యాపిల్ మంచిదని కాదు.. యాపిల్ కంటే అద్భుతమైన జామ పండు మనకు అందుబాటులో దొరుకుతుంది. కాబట్టి జామని తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments