School Holidays On Aug 25, 26 2024: విద్యార్థులకు పండగే.. ఆగస్టు 25, 26 రెండు రోజులు సెలవు.. ఎందుకంటే

School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్టు 25, 26 రెండు రోజులు సెలవు.. ఎందుకంటే

School Holidays-Aug 25, 26 2024: వరుస సెలవులు ఎంజాయ్ చేస్తోన్న విద్యార్థులకు మరో రెండు రోజులు సెలవులు కలిసి రానున్నాయి. ఆగస్టు 25, 26 రెండు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. ఎందుకంటే

School Holidays-Aug 25, 26 2024: వరుస సెలవులు ఎంజాయ్ చేస్తోన్న విద్యార్థులకు మరో రెండు రోజులు సెలవులు కలిసి రానున్నాయి. ఆగస్టు 25, 26 రెండు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. ఎందుకంటే

విద్యార్థులకు ఇప్పటికే వరుసగా 5 రోజుల సెలవులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి.. 19 వరకు వరుసగా సెలవులు రావడంతో.. బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.. ఐదు రోజుల సెలవులకు కారణం.. వరుసగా పండుగలు రావడం. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, 16, వరలక్ష్మి వ్రతం, 17 శనివారం, 18 ఆదివారం, 19 రాఖీ పండుగ రావడంతో.. వరుసగా సెలవులు వచ్చాయి. వీటిల్లో మహా అయితే 17 శనివారం నేడు స్కూల్‌ ఉండే అవకాశం ఉంది. అలా ఉన్నా రేపు ఆదివారం, సోమవారం రాఖీ కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఇక ఆగస్టు నాల్గవ వారంలో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే ఆగస్టు 21 న సెలవు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. భారత్‌ బంద్‌ వల్ల 21న విద్యా సంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఇదే వారంలో మరో రెండు సెలవులు రానున్నాయి. ఆ వివరాలు..

ఆగస్టు 25, 26న విద్యా సంస్థలకు సెలవులు ఉండనున్నాయి. ఎందుకంటే.. ఆగస్టు 25 ఆదివారం సెలవు. అన్ని స్కూళ్లు, కాలేజీలకు హాలీడేనే. ఇక ఆగస్టు 26 పోమవారం కూడా సెలవే. అందుకు కారణం కృష్ణాష్టమి. చాలా వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. దాంతో వచ్చే వారంలో విద్యార్థులకు మరో మూడు రోజులు లేదంటే కచ్చితంగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి.

ఇక ఆగస్టు నెల మొత్తం మీద స్కూల్స్‌, కాలేజీలకు 10 రోజులు వరకు సెలవులు వస్తున్నాయి. బంద్‌లు, భారీ వర్షాలు, పండగల వల్ల స్కూల్స్‌, కాలేజీలకు ఏదో ఒక రూపంలో హాలీడేలు వస్తునే ఉన్నాయి. ఇక వరుసగా సెలవులు రావడం వల్ల విద్యార్థులు పండగ చేసుకుంటారు. కానీ సిలబస్‌ కవర్‌ కాక టీచర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ అంశంలో టీచర్లపై ఒత్తిడి పెరగనుంది.

2024లో రానున్న పండగలు, సెలవుల వివరాలు..

  • 19-08-2024 (సోమవారం) రాఖీ పండగ
  • 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
  • 07-09-2024 (శనివారం) వినాయకచవితి
  • 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
  • 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
  • 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
  • 31-10-2024 (గురువారం) దీపావళి
  • 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన సెలవులు ఇవే..

  • దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
  • క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
  • అక్టోబరు 31న దీపావళి సెలవు.
  • డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
  • సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.
Show comments