JNVST: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే..

JNVST Class 6 Admission 2025 Registration: మీ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, ఆహారం, వసతి అందించాలని భావిస్తున్నారా.. అయితే మీకు బెస్ట్‌ ఆప్షన్‌ ఇప్పుడు మేం చెప్పబోయే పాఠశాలలు. ఆ వివరాలు..

JNVST Class 6 Admission 2025 Registration: మీ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, ఆహారం, వసతి అందించాలని భావిస్తున్నారా.. అయితే మీకు బెస్ట్‌ ఆప్షన్‌ ఇప్పుడు మేం చెప్పబోయే పాఠశాలలు. ఆ వివరాలు..

నేటి కాలంలో విద్య అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో సరిగా పాఠాలు చెప్పరు.. ఇంగ్లీష్‌ మీడియం కూడా అందుబాటులో లేకపోవడం.. వంటి కారణాల వల్ల చాలా మంది తల్లిదండ్రులు వేలకు వేల రూపాయలు ఖర్చు చేసి.. ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరైన వసతులు ఉండవు.. ప్లే గ్రౌండ్‌ కనిపంచను కూడా కనపించదు. ఎంతసేపు నాలుగు గోడల మధ్య విద్యార్థులను బంధీలుగా కూర్చోబెట్టి.. వారికి చదువులు చెబుతుంటారు. కేవలం బట్టీ విధానంలో చదువు నేర్పడమే చాలా ప్రైవేటు పాఠశాలల విధానంగా ఉంది. మానసిక, శారరీక వికాసం అనే మాట ఇక్కడ మచ్చుకైనా కనిపించదు.

అన్ని స్కూల్స్‌లో ఇదే పరిస్థితి ఉంటుందా అంటే కాదు. కానీ చాలా పాఠశాలల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఈ క్రమంలో ఒక్క రూపాయి ఫీజు చెల్లించే అవసరం లేకుండా.. ఉచితంగా వసతి, భోజనం, చదువు పొందే అవకాశం కల్పిస్తున్నాయి కొన్ని పాఠశాలలు. ఇంతకు అవి ఏవి.. మరి వాట్లిలో చేరాలంటే.. ఏం చేయాలి వంటి వివరాలు మీ కోసం..

మీ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటుగా వసతి, భోజనం సదుపాయాలు కావాలంటే.. అందుకు బెస్ట్‌ ఆప్షన్‌.. జవహర్‌ నవోదయ పాఠశాలలు. 5వ తరోగత పూర్తి అయిన విద్యార్థులకు వీట్లిలో ప్రవేశం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవోదయ విద్యాలయాల్లో 6వ త‌ర‌గ‌తి ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. 2025-26 విద్యా సంవత్సరానికి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఇది సెప్టెంబర్‌ 15వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ప్రస్తుతం 5వ త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులు దీనికి అప్లై చేసుకుంనేందుకు అర్హులు. 01-05-2013-31-07-2015 మధ్య జన్మించిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్‌-15 నవోదయ విద్యాలయాలున్నాయి.

జవహార్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌-2025 ఫేజ్-1 ఎగ్జామ్ నవంబర్‌లో, ఫేజ్-2 ఎగ్జామ్ జనవరి-2025లో జరగనున్నాయి. ఫలితాలను వచ్చే ఏడాది అనగా 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. దేశంలోని 653 విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ద‌ర‌ఖాస్తు కోసం https://cbseitms.rcil.gov.in/nvs/?AspxAutoDetectCookieSupport=1 లింక్‌ను క్లిక్ చేయండి

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఒక్కసారి సీటు వస్తే.. ఆరోతరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ.. చదువు, వసతి, భోజనం అంతా ఉచితం. నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ కూడిన అత్యుత్తమ విద్యా బోధన అందిస్తారు. నిపుణులైన అధ్యాపకులతో పాఠాలు భోదిస్తారు. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, అధునాత కంప్యూటర్‌ ల్యాబ్‌, పోషక విలువలతో కూడిన ఆహారం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్‌సీసీ తదితర అంశాలు ఈ నవోదయ విద్యాలయ ప్రత్యేకతలు.

పరీక్ష విధానం ఇలా ఉండనుంది..

నవోదయ ప్రవేశ పరీక్ష 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి. ఇందుకు రెండు గంటల వ్యవధి ఇస్తారు. దివ్యాంగులకు మరో 40 నిమిషాలు సమయం అదనంగా కేటాయిస్తారు. ఈ పరీక్షల ద్వారా మేధాశక్తిని పరీక్షిచేందుకు 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో ప్రతిభను పరీక్షించేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు, భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు ఉంటాయి.

ఫీజులు లేవు..

జేఎన్‌వీఎస్‌టీల్లో ఉన్న మరో ప్రత్యేకత.. ఏంటంటే ఇక్కడ సీటు వస్తే.. ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా  విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తారు. రెసిడెన్షియల్‌ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్నింటినీ ఉచితంగా ఇస్తారు. విద్యా వికాస్‌ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్‌ వర్గాల(దారిద్య్ర రేఖ దిగువ ఉన్న) పిల్లలకు మినహాయింపునిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే అప్లై చేసుకొండి.

Show comments