తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్!

Good News for Inter Students: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి రిలీజ్ చేశారు.

Good News for Inter Students: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి రిలీజ్ చేశారు.

తెలంగాణలో బుధవారం ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.  ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి శృతి ఫలితాలను రిలీజ్ చేశారు. ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. తెలంగాణలో ఈసారి కూడా అమ్మాయిలే తమ హవా కొనసాగించారు. ఈ సంవత్సరం 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్ లో 60.01 శాతం, సెకండ్ ఇయర్ 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.ఈ క్రమంలోనే విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ రిజల్ట్స్ వచ్చాయి. మొత్తం 9.80 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. మొదటి సంవత్సరం 60.01 శాతం, ద్వితీయ సంవత్సరం 64.01 శాతం మంది పాస్ అయ్యారు. ఈసారి అమ్మాయిలు తమ సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్ లో 68.95 శాతం, అబ్బాయిలు 51.05 శాతం ఉత్తీర్ణత పొందారు. సెకండ్ ఇయర్ లో 72.53 శాతం, అబ్బాయిలు 56.01 శాతం పాస్ అయ్యారు. ఇక జిల్లాల వారీగా రిజల్ట్ చూస్తే.. ఫస్ట్ ఇయర్ 71.7 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉండగా.. 71.58 శాతంతో మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో ఉంది. 44.29 శాతంతో కామారెడ్డి చివరి స్థానంలో నిలిచింది.

ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమంది విద్యార్థులు తొంతరపడి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారికి ఇంటర్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫెయిల్ అయ్యామని ఏమాత్రం దిగులు పడవొద్దని.. మరోసారి ప్రయత్నించి మంచి ఫలితం పొందాలని విద్యార్థులకు సూచించారున అధికారులు. తక్కువ మార్కులు వచ్చినట్లు భావిస్తే విద్యార్థులు వెంటనే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం తమ కాలేజ్ లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ వరకు నిర్వహిస్తామని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీస్ పూర్తి వివరాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ లో చూడవొచ్చని అధికారులు తెలిపారు.

 

Show comments