iDreamPost
android-app
ios-app

భార్య వేలు కొరికేసిన భర్త.. కారణం ఏంటంటే..

భార్య వేలు కొరికేసిన భర్త.. కారణం ఏంటంటే..

భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం సర్వ సాధారణం. అయితే, ఆ గొడవలకు కూడా ఓ లిమిట్‌ ఉంటుంది. హద్దులు దాటి గొడవలు జరిగితే.. అది దాంపత్య జీవితానికి పెద్ద దెబ్బగా మారుతుంది. ముఖ్యంగా కొట్టుకునే వరకు గొడవలు వెళ్లాయంటే.. అది ప్రమాదకర స్థాయి అని చెప్పొచ్చు. గొడవలు జరుగుతున్న సమయంలో.. క్షణికావేశంలో ఏమైనా జరగొచ్చు. ముఖ్యంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే సంఘటనలే ఎక్కువగా ఉంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పడి ఆమె వేలు కొరికేశాడు.

ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని బెంగూళరుకు చెందిన విజయ్‌ కుమార్‌, పుష్ప దంపతులకు 23 సంత్సరాల క్రితం పెళ్లయింది. వీరికో బాబు కూడా పుట్టాడు. పెళ్లయిన కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం మొదలైంది. విజయ్‌ కుమార్‌ తన భార్య పుష్పను మానసికంగా, శారీరకంగా బాగా హింసించే వాడు. కొన్ని నెలల క్రితం కూడా విజయ్‌..

పుష్పతో గొడవ పెట్టుకున్నాడు. భర్త వేధింపులు భరించలేక పుష్ప తన కుమారుడ్ని తీసుకుని వెళ్లిపోయింది. వేరే ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. అయితే, భార్య వేరుగా ఉండటం విజయ్‌కు నచ్చలేదు. జులై 28న భార్య ఉంటున్న ఇంటికి వెళ్లాడు. అక్కడ భార్యతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ చినికి చినికి గాలి వానలా అయింది. ఈ నేపథ్యంలోనే విజయ్‌కుమార్‌ భార్య వేలిని కొరికాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తన భర్త విజయ్‌పై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.