కుటుంబ కలహాలు.. భార్యని సుత్తితో కొట్టి చంపిన భర్త! ఎక్కడంటే?

Hyderabad Crime News: గత కొంత కాలంగా హైబారాబాద్ లో క్రైమ్ రేటు బాగా పెరిగిపోతుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు చివరికి విషాదాలుగా మిగులుతున్నాయి.

Hyderabad Crime News: గత కొంత కాలంగా హైబారాబాద్ లో క్రైమ్ రేటు బాగా పెరిగిపోతుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు చివరికి విషాదాలుగా మిగులుతున్నాయి.

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి క్షణికావేశానికి గురై ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. ఆ సమయంలో ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు కూడా తెగబడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబల్లో కలహాలు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే దంపతుల మద్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి దారుణాలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలతో ఓ భర్త కట్టుకున్న భార్యను ఎంత పనిచేశాడో తెలిస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ హైదర్ షాకోట్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో నిద్రిస్తున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు భర్త. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదర్ షాకోట్ లో నివసిస్తున్న శ్రీనివాస్ తన భార్యా, పిల్లలతో చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు పనులు మానేసి ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఇంట్లో భార్యతో గొడవ పడుతూ వస్తున్నాడు. తరుచూ భార్యను డబ్బు కోసం వేధించడంతో ఇద్దరి మధ్య కలహాలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ఏదో ఒక విధంగా భార్యను టార్చర్ చేయడం మొదలు పెట్టాడు శ్రీనివాస్.

భర్త టార్చర్ భరించలేక భార్య పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్ కి కౌన్సిలింగ్ ఇస్తూ ఇంటికి పంపుతూ వచ్చారు. అయినా శ్రీనివాస్ లో మార్పు రాలేదు. అంతేకాదు భార్యపై కక్ష్య పెంచుకున్న శ్రీనివాస్ ఆమెను హతమార్చేందుకు సిద్దమయ్యాడు.ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో తలపై బలంగా కొట్టి చంపాడు. అనంతరం పిల్లలతో సహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  శ్రీనివాస్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఓ వైపు తల్లి చనిపోయి.. తండ్రిని పోలీసులు అరెస్టు చేయడంతో పిల్లలు ఒంటరి అయ్యారు. దీనంగా విలపిస్తున్న ఆ చిన్నారులను చూసిన వాళ్లు కంటతడి పెడుతున్నారు.

Show comments