Nidhan
Jani Master Headed to Mumbai Jail: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు ఈ కేసులో మున్ముందు ఏం జరగబోతోందని అంతా చర్చించుకుంటున్నారు.
Jani Master Headed to Mumbai Jail: లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు ఈ కేసులో మున్ముందు ఏం జరగబోతోందని అంతా చర్చించుకుంటున్నారు.
Nidhan
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదుతో అన్వేషణ ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు గోవాలోని ఓ లాడ్జిలో అతడ్ని అరెస్ట్ చేశారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టాక.. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు. అయితే జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తీసుకెళ్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దీనిపై తాజాగా ఓ సమాచారం బయటకు వచ్చింది. అతడ్ని ముంబై జైలుకు తీసుకెళ్తారని తెలుస్తోంది. దీనికి సాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసు స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అలాంటప్పుడు అతడ్ని హైదరాబాద్ జైలుకే తరలించాలి. కానీ ముంబై జైలుకు ఎందుకు పంపాలని అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
జానీ మాస్టర్ కేసులో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో FIR నమోదైంది. అక్కడి నుండి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆ పీఎస్‌లోనే కేసును రిజిస్టర్ చేశారు. అయితే.. బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం ముంబై హోటల్లో ఎఫెన్స్ జరిగింది. ప్లేస్ ఆఫ్ ది ఎఫెన్స్ లెక్క ప్రకారం అయితే.. జానీ మాస్టర్‌ను ముంబైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ.. ఈ కేసు ప్రత్యేకం. ఎందుకంటే, పోక్సో చట్టం కేసు కింద ఫైల్ అయింది. బాధితురాలు ఉండేది ఇక్కడే కాబట్టి జానీ మాస్టర్‌ను ఇక్కడి జైలుకు పంపుతారా? ఒకవేళ ఇలా చేసినా ముంబైకి వెళ్లి సాక్ష్యాలు స్వీకరించాల్సి ఉంటుంది! టోటల్‌గా జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తరలిస్తారో చూడాలి. ఇక, జానీ మాస్టర్‌ను పోలీసులు తీసుకురాక ముందే ఓ పోలీసు స్టేషన్లో అతడి భార్య ఆయేషా రచ్చ రచ్చ చేసింది.
నార్సింగి పోలీసు స్టేషన్‌కు హడావుడిగా చేరుకున్న ఆయేషా.. జానీ ఎక్కడంటూ రచ్చ చేసింది. తన భర్తను చూపించాలంటూ హంగామా చేసింది. అయితే జానీ ఇంకా హైదరాబాద్ రాలేదని, తీసుకొస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆయేషా.. మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ పీఎస్‌లోనే జానీ ఉన్నాడంటూ ఫేక్ కాల్ రావడంతో క్లారిటీ కోసం వచ్చానని తెలిపింది. ఆమె పోలీసు స్టేషన్లో జానీ ఎక్కడ అంటూ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, జానీ మాస్టర్ అరెస్ట్‌కు ఆమె భార్యనే కారణమంటూ పుకార్లు వస్తున్నాయి. భర్త జాడ ఆమె బయటపెట్టడంతో పోలీసులు ఆ లొకేషన్‌కు వెళ్లి అదుపులోకి తీసుకున్నారని వినిపిస్తోంది. ఇదే తరుణంలో జానీ మాస్టర్‌ను ఏ జైలుకు తీసుకెళ్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ఈ కేసులో ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.