యాక్సిడెంట్ అయ్యి జాబ్ మానేశారా? ఇలా చేస్తే ప్రతి వారం డబ్బులొస్తాయి!

Accident: మీకు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆదాయం ఉండదు. ఇక మీకు అలాంటి పరిస్థితి ఉన్నా కానీ మీకు ప్రతి వారం డబ్బులు వస్తాయి.

Accident: మీకు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఆదాయం ఉండదు. ఇక మీకు అలాంటి పరిస్థితి ఉన్నా కానీ మీకు ప్రతి వారం డబ్బులు వస్తాయి.

రోడ్డు యాక్సిడెంట్స్ అనేవి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. కొన్ని యాక్సిడెంట్స్ అయితే వ్యక్తులనే కాదు.. మొత్తం కుటుంబాన్నే కష్టాల్లోకి పడేస్తాయి. ఒకవేళ ఇంటి పెద్ద ఓ పెద్ద రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవాల్సిందే. చనిపోకపోయిన కొన్ని సందర్భాలలో మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎక్కువ నెలలు పని చేసే అవకాశం లేకపోవచ్చు. అయితే ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. కచ్చితంగా Health Insurance తో పాటు Personal Accident Insurance తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య బీమా, జీవిత బీమా లాగే ఈ ప్రమాద బీమా కూడా తీసుకోవాల్సిన అవసరం కచ్చితంగా ఉంది. దీని వల్ల కలిగే లాభాలు? ఇంకా పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీకు యాక్సిడెంట్ అయ్యింది. ఎక్కువ రోజులు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైమ్ లో మీకు ఆదాయం ఉండదు. మీకు కంపెనీ నుంచి జీతం రాదు. ఇలాంటి పరిస్థితిలో మీకు ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వల్ల మీకు యాక్సిడెంట్ అయ్యి ఉద్యోగం చేయకపోయినా కూడా ప్రతి వారం డబ్బులు చెల్లిస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీలు. మీరు ఎన్ని రోజులైతే ఇంట్లో ఖాళీగా ఉంటారో అన్నీ రోజులు మీ బ్యాంక్ అకౌంట్ లో ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు పంపిస్తాయి. అయితే ఈ పాలసీ తీసుకోవడం వల్ల కంపెనీలు మీకు వారానికి ఎంత డబ్బు చెల్లిస్తాయి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ కంపెనీలు వారానికి 50 వేలు దాకా డబ్బులు ఇస్తాయి. అంటే మీకు మీ కంపెనీ ఇస్తున్న జీతాన్ని బట్టి ఈ డబ్బులు వస్తాయి. మీ జీతంలో 25% ని బీమా కంపెనీలు మీకు ప్రతి వారం చెల్లిస్తాయి. అయితే మీకు యాక్సిడెంట్ అయినట్టు, మీరు ఆఫీసుకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నట్టు, మీకు జీతం రానట్టు ప్రూఫ్ లను కచ్చితంగా బీమా కంపెనీలకు ఇవ్వాలి. మెడికల్ సర్టిఫికెట్, మీ శాలరీ డీటైల్స్ కచ్చితంగా ఇవ్వాలి. ఇలా మీకు 100 weeks దాకా ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతి వారం డబ్బులు ఇస్తాయి. మీకు యాక్సిడెంట్ అయ్యి ఎక్కువ రోజులు జాబ్ చేయలేకపోతే ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మార్కెట్లో తక్కువ ప్రీమియంకే ఈ పాలసీ ఇచ్చే కంపెనీలు ఉంటాయి. వాటిలో ఏది మంచిదో చూసుకొని పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments