OYO బుకింగ్స్ లో తెలుగువాళ్లే టాప్.. ఎక్కువగా ఆ రోజే!

ఓయో 2023 ఏడాదికి సంబంధించిన రిపోర్ట్స్ ను విడుదల చేసింది. ఈ రిపోర్డులో షాకింగ్ విషయాలు వెల్లడైయ్యాయి. మరి బుకింగ్స్ లిస్ట్ లో తొలి ప్లేస్ లో ఏ నగరాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓయో 2023 ఏడాదికి సంబంధించిన రిపోర్ట్స్ ను విడుదల చేసింది. ఈ రిపోర్డులో షాకింగ్ విషయాలు వెల్లడైయ్యాయి. మరి బుకింగ్స్ లిస్ట్ లో తొలి ప్లేస్ లో ఏ నగరాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. దీంతో పలు సంస్థలు సంవత్సరం పొడుగునా తమ కంపెనీ సాధించిన వృద్ధికి సంబంధించిన గణాంకాలను విడుదలచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరానికి, ఈ ఏడాదికి బిజినెస్ పెరిగిందా? లేదా? అన్న లెక్కలు చూసుకుంటూ రిపోర్టులు రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ హోటల్ బుకింగ్ ప్లాట్ ఫామ్ అయిన ఓయో 2023 ఏడాదికి సంబంధించిన రిపోర్ట్స్ ను విడుదల చేసింది. ఈ రిపోర్డులో షాకింగ్ విషయాలు వెల్లడైయ్యాయి. ఈ లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఇక ప్రేమికుల రోజు కాకుండా మరో తేదీలో ఎక్కువ బుకింగ్స్ జరగడం విశేషం. మరి ఈ లిస్ట్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ హోటల్ బుకింగ్ ప్లాట్ ఫామ్ అయిన ఓయో కంపెనీ 2023 సంవత్సరానికి సంబంధించిన రిపోర్టులను విడుదల చేసింది. ఓయో ట్రావెలోపీడియా 2023 పేరుతో ఈ రిపోర్టును సోమవారం రిలీజ్ చేసింది. రాష్ట్రాలు, నగరాలతో పాటుగా ఆధ్యాత్మిక ప్రదేశాల వారీగా ఈ నివేదికలో ర్యాంకుల్ని పొందుపరిచింది. ఆ వివరాల్లోకి వెళితే..ఈ సంవత్సరం ఎక్కువ బుకింగ్స్ అయిన నగరాల లిస్ట్ లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బెంగళూరు, మూడవ స్థానంలో కోల్ కత్తా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే.. పలు నగరాలు బుకింగ్స్ లో అభివృద్ధి కనబర్చాయి. అయితే రాష్ట్రాల జాబితా చూస్తే మాత్రం ఎక్కువ బుకింగ్స్ నమోదైన స్టేట్ గా ఉత్తరప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. ఖాళీ టైమ్ లో ఎక్కువ మంది సందర్శించిన ప్లేసుల్లో జైపూర్ తొలి ప్లేస్ ని ఆక్రమించింది. ఈ కేటగిరిలో తర్వాతి స్థానాల్లో గోవా, మైసూర్, పుదుచ్చేరిలు ఉన్నాయి. ఇక ఆధ్యాత్మిక ప్లేసుల్లో పూరీ ఫస్ట్ ప్లేస్ లో నిలవగా.. అమృత్ సర్, వారణాసి, హరిద్వార్ లు వరుసగా ప్లేసుల్లో నిలిచాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఈ ఏడాది ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న కాకుండా.. ఎక్కువ బుకింగ్స్ సెప్టెంబర్ 30వ తేదీన నమోదైనట్లు సంస్థ తెలిపింది. అయితే నెలల పరంగా చూస్తే.. మే నెలలో అత్యధిక బుకింగ్స్ అయ్యాయని కంపెనీ తెలిపింది. కాగా.. కొవిడ్ తర్వాత నూతన ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగిందని, ఈ ఏడాది కూడా ఇదే ట్రెండ్ కొనసాగిందని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే తెలిపాడు. మరి ఓయో విడుదల చేసిన రిపోర్టులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments