iDreamPost
android-app
ios-app

7 ఏళ్ల క్రితం భర్త మిస్సింగ్.. కట్ చేస్తే బిగ్ బాస్‌లో ప్రత్యక్షం! ఎలా వచ్చాడంటే?

  • Published Feb 02, 2024 | 4:31 PM Updated Updated Feb 02, 2024 | 4:31 PM

టీవీ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ చాలా స్పెషల్. ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదు. కంటెస్టెంట్స్ చేసే యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్స్ అన్నింటిని కాప్చర్ చేసి.. ఓ షోగా ప్రసారం చేస్తుంది ఈ టీం. దీనికి విపరీతమైన అభిమానులున్నారు. ఈ షో వల్ల విడిపోయిన భార్యా భర్తలున్నారు. కానీ ఓ జంటను కలిపింది.. అదెలా అంటే..

టీవీ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ చాలా స్పెషల్. ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదు. కంటెస్టెంట్స్ చేసే యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్స్ అన్నింటిని కాప్చర్ చేసి.. ఓ షోగా ప్రసారం చేస్తుంది ఈ టీం. దీనికి విపరీతమైన అభిమానులున్నారు. ఈ షో వల్ల విడిపోయిన భార్యా భర్తలున్నారు. కానీ ఓ జంటను కలిపింది.. అదెలా అంటే..

  • Published Feb 02, 2024 | 4:31 PMUpdated Feb 02, 2024 | 4:31 PM
7 ఏళ్ల క్రితం భర్త మిస్సింగ్.. కట్ చేస్తే బిగ్ బాస్‌లో ప్రత్యక్షం! ఎలా వచ్చాడంటే?

బుల్లితెరపై ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేదు. 24/7 ఏదో ఒక సీరియల్, సినిమాలు, షోలు అలరిస్తూనే ఉంటాయి. అయితే అతి పెద్ద రియాలిటీ గేమ్ షోగా నిలిచింది మాత్రం బిగ్ బాస్. ఇప్పటి వరకు అనేక భాషల్లో అలరిస్తూ ఉంది ఈ షో. విమర్శలు వచ్చినా..కేసులు పెడతామంటూ బెదిరింపులు ఎదురైనా.. దీనికి మాత్రం ఆదరణ తగ్గలేదు. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ఈ షోకు వెళ్లిన కంటెస్టెంట్స్ సంగతి చెప్పనక్కర్లేదు. అడపా దడపా సినిమాలు, సీరియల్స్, యూట్యూబర్స్, షార్ట్ ఫిల్మ్ లో నటించిన కొంత మంది.. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టి ఫేమ్, నేమ్ తెచ్చుకున్నారు. సాధారణంగా ఈ షోలోకి ఓ జంట వెళితే.. విడిపోయేంత గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఓ జంటను కలిపింది బిగ్ బాస్ షో. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించిన ఇది వాస్తవం.

ఇంతకు ఏం జరిగిందంటే.. కొన్ని సంవత్సరాల క్రితం భర్త తప్పిపోగా.. పిల్లలతో బతుకు ఈడుస్తోంది ఇల్లాలు. ఇది జరిగి ఆరేడు ఏళ్లు అయిపోయింది. ఇంతలో బిగ్ బాస్ స్టార్ అయ్యింది. ఆమెకు కూడా ఆ షోకు ఫ్యాన్ కావడంతో వాచ్ చేయడం స్టార్ చేసింది. ఇంతలో అందులో ఉన్న ఓ ట్రాన్ జెండర్ కంటెస్టెంట్‌ను ఎక్కడో చూసినట్లుగా ఉందే.. అని పదే పదే అనిపించింది ఆమెకు. ఇంకాస్త తీక్షణంగా చూడగా.. ఆ వ్యక్తి.. పరారైన తన భర్త అని అనుమానించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటన కన్నడ నాట చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. లక్షణరావు కొన్నాళ్ల కిందట భార్యా బిడ్డలను వదిలేసి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా అతడి జాడ కానరాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. కుటుంబ బాధ్యతలను తన భుజాన వేసుకున్న భార్య.. బిడ్డల్ని తన రెక్కల కష్టంపై పెంచుతుంది.

అయితే ఇటీవల బిగ్ బాస్ షోకు సంబంధించిన వీడియోలను టీవీలో చూస్తుండగా.. అందులో హిజ్రా కంటెస్టెంట్ నీతు వనజాక్షి అచ్చం తన భర్తలా ఉన్నాడని భార్యకు తోచడంతో.. పలు మార్లు వీడియోలను చూసింది. ఎట్టకేలకు తన భర్త అని నిర్దారణకు వచ్చిన ఆమె.. వెంటనే ఐజూరు పోలీసులకు సమాచారం అందించింది. రియాలిటీ షోలో పాల్గొన్న ట్రాన్స్ జెండర్ తన భర్తేనని తెలిపింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక.. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఘన స్వాగతం పలికింది. అలాగే రష్మిక అనే ట్రాన్స్ జెండర్స్‌తో కలిసి వనజాక్షి వీడియోలను చేసింది. పోలీసులు రష్మిక ట్రాన్స్ జెండర్‌ను సంప్రదించగా.. ఆమె పేరు విజయలక్ష్మి అని తెలిపింది. ఆ తర్వాత వనజాక్షిగా పేరు మార్చకుని బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లినట్లు చెప్పింది రష్మిక.

విజయలక్ష్మిని పోలీసులు పిలిపించి.. విచారించగా.. తను లక్ష్మణరావు కాదంటూ బుకాయించింది. అయితే భర్త ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయో భార్య చెప్పడంతో..అవి నిజమేనని తేలడంతో నిజం ఒప్పుకోక తప్పలేదు ట్రాన్స్ జెండర్‌గా మారిన లక్ష్మణరావు. భార్యా పిల్లలను వదిలి వెళ్లిపోయాక.. ఇలా మారినట్లు చెప్పడంతో.. భార్య దెబ్బకు కళ్లు తిరిగి పడిపోయింది. ఎందుకు ఫ్యామిలీని వదిలేసి వెళ్లిపోయావన్న ప్రశ్న అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు సైతం షాక్ తిన్నారు. సంసార జీవితం కన్నా.. హిజ్రా జీవితమే బాగుందని చెప్పాడు. కుటుంబంతో కలిసి జీవించేందుకు నిరాకరించాడు. బతిమాలాడినా ససేమీరా అన్నాడు. చివరకు పోలీసులు ఓ పత్రాన్ని రాయించుకుని..కేసును మూసివేసి.. అతడ్ని విడిచిపెట్టారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetGrandpashabetMeritkingCasibomCasibomcasibomjojobet günceldeneme bonusu veren sitelerjojobetMadridbetMadridbetJojobetnakitbahisJojobetjojobetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetbetciojojobetcasibomJojobetbetcio