Arjun Suravaram
Weather Latest Update AP And TG: ఇప్పటికే కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఏపీ , తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. కాస్తా వానలు తగ్గాయి అని ఊపిరి పీల్చుకుంటుగా..మరో వార్త అలెర్ట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Weather Latest Update AP And TG: ఇప్పటికే కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు ఏపీ , తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. కాస్తా వానలు తగ్గాయి అని ఊపిరి పీల్చుకుంటుగా..మరో వార్త అలెర్ట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Arjun Suravaram
గత కొన్ని రోజులుగా కురిసిన వానలకు తెలుగు రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదు. భారీ వరదల కారణంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలు చిగురుటాకులా వణికాయి. అలానే విజయవాడ, ఖమ్మం పట్టణాల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేలాది ఇళ్లు నీట మునిగి..లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు తగ్గిన.. ఆ ప్రభావం నుంచి ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోలేదు. ఈ క్రమంలోనే తాజాగా మరో పిడుగులాంటి వార్త వచ్చింది. నేడు కూడా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాదా వాతావరణ శాఖ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.
గురువారం ఏపీలోని పశ్చిమ – మధ్య పరిసర బంగాళాఖాతం వద్ద కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఒకటి ఏర్పడింది. అలానే బంగాళఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం కేంద్రం నుంచి, తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు మరియు ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుందని తెలిపింది. శుక్రవారం భారీ వర్షాలు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి.
నేడు హైదరాబాద్ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే.. ఇక్కడ వాయుగండం ముప్పు తప్పినట్టే కనిపిస్తోంది. అయితే మరో అల్పపీడనం వచ్చే ఛాన్సు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరదిశగా కదులుతుండటంతో ఏపీపై ప్రభావం తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావం రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ అల్పపీడన ప్రభావంతో నేడు కోస్తా ప్రాంతంలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. అదే విధంగా దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. న్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు. అల్పపీడన ప్రభావంతో నేడు ,రేపు సముద్రం పోటెత్తుతుందని గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు అంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.