హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. ఎన్ఐఏ అలర్ట్!

Terrorists in Hyderabad: గత కొంత కాలంగా భారత దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పలు కీలక ప్రదేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

Terrorists in Hyderabad: గత కొంత కాలంగా భారత దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. పలు కీలక ప్రదేశాల్లో విధ్వంసాలు సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

గత కొంత కాలంగా దేశంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పపడుతున్నారు. కొంతమంది ఉగ్రమూకలు బంగ్లాదేశీయులు కలిసి భారత్ లో మళ్లీ అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ హెచ్చరిస్తుంది. ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో సోదాలు నిర్వహిస్తుంది. భారతదేశాన్ని అస్థిరపరచాలనే కుట్రతో ఆల్ ఖైదా చేపడుతున్న కార్యక్రమాలకు కొంతమంది దేశ ద్రోహులు నిధులు సమకూరుస్తున్నారని ఎన్ఐఏ గుర్తించింది. కర్ణాటక, పశ్చిమబెంగాల్, అస్సాం, జమ్మూకశ్మీర్, బిహార్, త్రిపుర రాష్ట్రాల్లోని కొన్ని ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఉగ్రవాద కదలికలు ఏపీ, తెలంగాణలో కూడా ఉన్నాయని ఎన్ఐఏ అలర్ట్ జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

ముఖ్యంగా హైదరాబాద్, విశాఖపట్నం టార్గెట్ చేసుకొని ఉగ్రదాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ‌కు చెందిన కొంతమంది ఇక్కడ మకాం వేసి దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటలీజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉగ్రవాదుల కదలికలను ముందుగానే పసిగట్టిన ఎన్ఐఏ ఆయా రాష్ట్రాల పొలీస్ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐసీస్ తర్వాత భారత్ కు హిజ్బ్ ఉత్ తహ్రీర్ తో పెద్ద ముప్పు పొంచి ఉన్నట్లు ఏన్ఐఏ చెబుతుంది. అయితే ఈ సంస్థతో సంబంధాలు ఉన్న పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటలీజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేస్తున్న అల్‌ ఖైదా నెట్ వర్క్ సానుభూతి పరులు కుట్రలు చేస్తున్నారు. భారత దేశంలో అమాయకులు, మానసికంగా బలహీనమైనవారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న యువతను ఆకర్షిస్తూ వారిని ఉగ్రవాదం వైపు మల్లించే కుట్ర పన్నుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలో స్లీపర్ సెల్స్ మకాం వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి’ అంటూ ఆయా రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది ఎన్ఐఏ.

గతంలో హైదరాబాద్ లో గోకుల్ చాట్, దిల్‌సుఖ్ నగర్, లుంబినీ పార్క్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. మరోసారి అలాంటి విధ్వంసాలకు ఉగ్రమూకలు కుట్రలు పన్నే ఛాన్స్ ఉందని ఎన్ఐఏ హెచ్చరిస్తుంది. లెబనాన్ కి చెందిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ అనే ఉగ్రవాద సంస్థ హైదరాబాద్ లో యాక్టివిటీస్ మొదలు పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఎన్ఐఏ. బంగ్లాదేశ్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ ఎంతోమంది యువతను పలు రకాలుగా ప్రలోభాలు గురి చేసి స్లీపర్ సెల్స్ గా మార్చుకున్నట్లు ఇంటలీజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. లెబనాన్ నుంచి నిధులు బంగ్లాదేశ్ ద్వారా ఈ సంస్థకు చేరుతున్నట్లు ఇంటలీజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ఓ హూటల్‌లో ‘ఆపరేషన్’ పేరుతో మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆ టీమ్ మెంబర్స్ నగరంలో అశాంతి సృష్టించడానికి కొంతమంది యువత బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అలర్ట్ అయి నిర్వాహకులను తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాదు హూటల్ ని సీజ్ కూడా చేశారు.

ఇటీవల హైదరాబాద్ లో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ విభాగానికి ఎన్ఐఏ అలర్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాదు కొంతమంది అనుమానితుల ఫోటోలు భద్రతా సిబ్బందికి పంపించి వారిపై నిఘా ఉంచాలని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నగరంలో ఎక్కడైనా అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాని కోరుతున్నారు. మీరు అందించే సమాచారంతో నిజంగానే విధ్వంసాలకు పాల్పడే వస్తువులు ఉంటే వాటిని పోలీసులు గుర్తించి డిఫ్యూజ్ చేస్తారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని పోలీసులు చెబుతున్నారు.

Show comments