ఒక్క స్టేట్‌మెంట్‌తో బాబు బండారం బయటపడింది! పీవీ రమేష్‌ ఏం చెప్పారు?

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసు విషయంలో బాబును శనివారం రాత్రి ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఏసీబీ కోర్టులో బాబును ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్‌ చేసి.. సాయంత్రం తీర్పు వెల్లడించారు. అయితే.. ఈ కేసులో మొదట చంద్రబాబు ఏ1గా లేరు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో బాబును సీఐడీ ఏ1గా మార్చింది. ఇంకీ.. ఈ పీవీ రమేష్‌ ఎవరు? ఆయన స్టేట్‌మెంట్‌లో ఏం చెప్పారో? ఇప్పుడు తెలుసుకుందాం..

పీవీ రమేష్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేశారు. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోనే ఈ స్కిల్‌ స్కామ్‌ డొంక కదిలింది. రమేష్‌ ఏపీ ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సమయంలో సీమెన్స్‌కి నిధులు విడుదల చేసేందుకు నిరాకరించి, అప్పటి ప్రభుత్వాన్ని వారించి, సీమెన్స్‌ సంస్థకు నిధులు విడుదల చేయొద్దని సూచిస్తూ సీఎస్‌కు లేఖ కూడా రాసినట్లు సీఐడీ విచారణలో పీవీ రమేష్‌ వెల్లడించారు.

అయినా కూడా ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే నిధులు విడుదల చేసినట్లు సీఐడీ ఆరోపిస్తూ.. అప్పటి వరకు ఏ37గా ఉన్న చంద్రబాబును పీవీ రమేష్‌ ఏ1గా చేర్చారు. పీవీ రమేష్ వైసీపీ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. పుణెలో స్కామ్‌ లింకులు బయటపడ్డాక రమేష్‌‌ను విచారించింది సీఐడీ. సీమెన్స్‌ ప్రతినిధులను కూడా విచారించింది సీఐడీ. పీవీ రమేష్‌ అప్రూవర్‌గా మారడంతో కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. పీవీ రమేష్‌ స్టేట్‌మెంట్‌ కారణంగానే.. తొలి సారి చంద్రబాబు జైలుకు వెళ్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ట్రెండింగ్ లో ‘అవినీతి చక్రవర్తి బాబు’

Show comments