ఏపీ, తెలంగాణకు IMD అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

Rain Alert in Hyderabad: ఈ నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకటీ రెండు రోజులు తప్ప వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే పగలంతా విపరీతంగా ఎండలు.. సాయంత్రం కాగానే భారీ వర్షాలు పడుతున్నాయి. ఐఎండీ సూచన ప్రకారం..ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

Rain Alert in Hyderabad: ఈ నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒకటీ రెండు రోజులు తప్ప వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే పగలంతా విపరీతంగా ఎండలు.. సాయంత్రం కాగానే భారీ వర్షాలు పడుతున్నాయి. ఐఎండీ సూచన ప్రకారం..ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.

ఈ ఏడాది దేశంలో రుతు పవనాలు చురుగ్గా సాగున్నాయి.. దీని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళా, అస్సాం, బీహార్, ఏపీ, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పలు రాష్ట్రాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి.. పలు పురాతన కట్టడాలు కూలిపోయాయి. గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాలను వరుణుడు వీడటం లేదు. ఉత్తర్ ప్రదేవ్, జార్ఖండ్ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో నేడు ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత కొన్నిరోజులుగు తెలంగాణ, ఏపీలో జోరుగా వర్షాలు కరుస్తున్నాయి. తాజాగా ఇరు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నేడు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైన ఉందని.. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో మంచిర్యాల, సిరిసిల్ల, నిర్మల్, కొమురం భీమ్, ఆసీఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో వనపర్తి జిల్లాలో రేవెల్లి లో అత్యధికంగా 9.60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. మూడు నాలుగు రోజులు వర్షాలు పడతాయని తెలిపింది.

ఇక ఏపీ విషయానికి వస్తే.. ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతీ గాలులు వీస్తున్నాయని.. దీని ప్రభావం అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, విశాఖ, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూల్, అనంతపురం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

Show comments