AP ప్రజలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్!

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ప్రజలకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా ఓ విషయంలో ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం ప్రజలకు తరచూ ఏదో ఒక శుభవార్త చెబుతూనే ఉంటుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెబుతుంది. తాజాగా ఓ విషయంలో ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తన పరిపాలన సాగిస్తున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. అలానే తరచూ వివిధ వర్గాల ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు సీఎం జగన్ శుభవార్త చెబుతుంటారు. తాజాగా మరోసారి ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. విద్యుత్ ధరలకు సంబంధించి ప్రజలకు ఈ గుడ్ న్యూస్ ను  అందించింది. విద్యుత్ వినియోగదారులకు ఛార్జీల భారం పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది మాదిరే ఈ సారి కూడా ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. కేవలం రైల్వే మినహా ఏ వర్గానికి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. గతేడాదిలో వసూలు చేసిన ఛార్జీలే ఈ ఏడాదికి  కూడా వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను రిటైల్ సప్లయ్ టారిఫ్ ధరలను విద్యుత్ శాఖ అధికారుల విడుదల చేశారు. మూడు డిస్కంల పరిధిలో గృహా, వాణిజ్య, పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ టారీఫ్ ధరలను ఏపీఈఆర్సీ ఛైర్మన్ విడుదల చేశారు.

వినియోగదారులపై భారం లేకుండా టారిఫ్ రూపకల్పన చేశారు. తాజాగా నిర్ణయం ద్వారా రూ.15, 299 కోట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వరుసగా ఐదో ఏడాది కూడా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వ సహాకారంతో విద్యుత్ రెగ్యులేటరీ అథారిటీ ఈ నిర్ణయాలు తీసుకుందని అధికారులు చెబుతున్నారు. తాజా నిర్ణయంతో ఈ ఏడాది విద్యుత్‌ వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని వెల్లడించారు. మరి.. ఏపీ విద్యుత్ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments