Dharani
Dharani
కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్‌లో యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ పలువురు ముస్లిం మత పెద్దలు, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు రెండు రోజుల క్రితం అనగా బుధవారం చంద్రబాబును కలిశారు. ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు అవమానం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చంద్రబాబు అందరి ముందు తన మీద చేయి చేసుకోవడంతో.. జలీల్ ఖాన్ అలిగారు. అసలు ఇంతకు ఏం జరిగింది అంటే.. చంద్రబాబు నాయుడు బుధవారం మైనార్టీ నేతలు, మత పెద్దలతో సమావేశం అయ్యారు.
చంద్రబాబు మాట్లాడుతుండగా.. ఆయన పక్కనే కూర్చున్న జలీల్ ఖాన్.. వెనక్కి తిరిగి ఎవరితోనే మాట్లాడుతుంటారు. అది గమనించిన చంద్రబాబు.. జలీల్ ఖాన్ కాలు మీద కొడతారు. దాంతో తేరుకున్న జలీల్ ఖాన్ ముందుకు తిరిగి కూర్చుంటాడు. అయితే అందరి ముందు చంద్రబాబు తన మీద చేయి చేసుకోవడంతో జలీల్ అవమానంగా ఫీలయ్యారు. దాంతో ముఖం మాడ్చుకుని కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక సమావేశం ముగిసిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ..ఈ దేశ సంస్కృతికి యూసీసీ విరుద్ధమని చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. చంద్రబాబుతో సమావేశం పూర్తి సంతృప్తికరంగా జరిగిందన్నారు. ముస్లింల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు చెప్పారని తెలిపారు.ముస్లింల మనోభావాలకు విరుద్ధంగా తెలుగు దేశం ఎలాంటి నిర్ణయం తీసుకోదని చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని తెలిపారు.
అయ్యో జలీన్ ఖాన్ 🙄 ఎంత అవమానం 🤷♀️పరువు పొయ్యే
మైనార్టీల సమావేశంలో జలీల్ ఖాన్ ని కొట్టిన ముసలోడు చంద్రబాబుఅలిగిన జలీల్ ఖాన్ 🤭🤭 pic.twitter.com/w5yMOpIYXr
— Anitha Reddy (@Anithareddyatp) July 20, 2023