AP Rains: విశాఖ- కాకినాడ తీరాల్లో ఎగిసిపడుతున్న రాకాసి అలలు..

AP Rains- IMD Alert For 5 Districts: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. వాయుగుండం తీరం దాటిన తర్వాత వర్షాలు మరింత పెరిగాయి. ఏపీలోని తీర ప్రాంతాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. విశాఖ- కాకినాడ తీరాల్లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి.

AP Rains- IMD Alert For 5 Districts: ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. వాయుగుండం తీరం దాటిన తర్వాత వర్షాలు మరింత పెరిగాయి. ఏపీలోని తీర ప్రాంతాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. విశాఖ- కాకినాడ తీరాల్లో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి.

ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనం స్తంభించిపోయింది. వాయుగుండం తీరం దాటినట్లు అధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లా తడ వద్ద వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం తీరం దాటిన తర్వాత జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా 5 జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం- కాకినాడలోని సముద్ర తీరాలు భయానకంగా మారాయి. ఏపీలోని సముద్ర తీరాల్లో భయంకరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాకాసి అలలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. చాలాచోట్ల సముద్రం ముందుకొచ్చేసింది. తీరంలో ఉన్న ఇళ్లు, దుకాణాలను సముద్రపు నీరు తాకుతోంది. ముఖ్యంగా రాయలసీమ సహా.. గుంటూరు, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. మరి.. వాయుగుండం ప్రభావం ఏ జిల్లాలపై ఉండనుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి ఈ వివరాలు తెలుసుకుందాం….

వాయుగుండం తిరుపతి జిల్లా తడ వద్ద తీరం దాటింది. వాయుగుండం తీరం దాటిన తర్వాత అల్పపీడనంగా బలహీనం అయ్యింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారవంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. కాకినాడ జిల్లా U.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. వర్షాలకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గోదావరి సంగమం వద్ద అలలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. పలు తీరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ ఆర్కే బీచ్ వద్ద అలలు దుకాణాలను తాకాయి. ఓడలరేవు తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం నీళ్లు ఆక్వా చెరువులను ముంచెత్తాయి. ONGC ప్లాంటును సముద్రపు నీరు తాకింది. అలాగే వర్షాలకు జలాశయాలకు పెద్దఎత్తున వర్షపు నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు.

ముఖ్యంగా చిత్రావతి నది ఉగ్రరూపం దాల్చింది. చిత్రావతి నది ఉద్ధృతికి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రాహ్మణపల్లి, చిన్నప్పరెడ్డిపల్లి, వెల్దుర్తి వంటి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు పెద్దఎత్తున వరదనీరు చేరుతోంది. మరోవైపు సర్వారాయ, పైడిపాలెం, వామికొండ రిజర్వాయర్లకు కూడా వరద నీరు చేరుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. చాలాచోట్ల భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చెట్లు నేలకూలడం, విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లు, రహదారులు కూడా జలమయం అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి అంటూ హెచ్చరిస్తున్నారు. మరోవైపు వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే పశువుల కాపరులు, కూలి పనులకు వెళ్లే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Show comments