AP: కళ్ల ముందే వరదలో కొట్టుకుపోయిన ఇళ్లు! వీడియో చూడండి

Andhrapradesh Rain Updates: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అకాల వర్షాలకు అతలాకుతలం అవుతున్నారు. చాలా ప్రదేశాలు నీటితో మునిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది . దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

Andhrapradesh Rain Updates: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అకాల వర్షాలకు అతలాకుతలం అవుతున్నారు. చాలా ప్రదేశాలు నీటితో మునిగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది . దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. అటు అధికారులు కూడా.. ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. రానున్న 24 గంటలు మరింత అపప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలలకు రెడ్ , ఆరెంజ్ ,ఎల్లో ఎలెర్ట్స్ లు జారీ చేశారు. అలాగే ఇప్పటివరకీ ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు.. జనవజీవనం అతలాకుతలం అవుతున్నారు. రహదారులన్నీ చెరువులుగా మారాయి. బస్సు స్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు మునిగిపోయాయి. డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షం నీరు రహదారులపై నిలిచిపోవడంతో.. వాహన దారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో తాజగా ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదయింది. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్ డేట్స్ ను ఇప్పటికే మీడియా , సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇక ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో.. పులి వాగు వరదలా పొంగుతుంది. అలాగే అక్కడే ఓ దారుణం చోటు చేసుకుంది. కళ్ళ ముందే ఇల్లు కుప్పకూలిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చూస్తూ ఉండడం తప్ప ఏమి చేయలేని పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలాగే అందరిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా అధికారులకు సహకరించడం మంచిది.

ఆంధ్ర రాష్ట్రంలో చాలా జిల్లాలలో రికార్డు స్థాయి వర్ష పాతం నమోదయింది. ఇక మరోవైపు తెలంగాణాలో కూడా నిన్నటినుంచి కుండపోత వర్షం కురవడంతో.. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. రాబోయే 24 గంటలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని..అటు అధికారులు , ఇటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలంతా సురక్షితంగా ఉండడం మంచిది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అటు పోలీసులు కూడా ఎలాంటి సమస్యలను లెక్క చేయకుండా.. సాహసోపేతంగా ప్రజల సంరక్షణ పట్ల శ్రద్ద వహిస్తున్నారు. మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments