వీళ్లు చాలా రిచ్ గురూ.. అమ్మవారికి టమాటాలతో మొక్కు చెల్లింపు

సాధారణంగా మనం కష్టాలు, ఆపదలో ఉన్నప్పుడు మీ గుడికి వచ్చి మొక్కు చెల్లిస్తామంటూ ఆ దేవుడికి మొక్కుకుంటాము. ఇక అనుకున్నట్టు ఆ దేవుడు మనలను ఆపద నుంచి రక్షించగానే వెంటనే ఆ దేవుడి గుడికి వెళ్లి మొక్కును చెల్లిస్తుంటాము. ఈ మొక్కు చెల్లింపులో భాగంగా కొందరు తల నీలాలు సమర్పిస్తే.. మరి కొందరు బంగారం, డబ్బు, బెల్లం వంటి వాటితో మెక్కును చెల్లిస్తుంటారు. కానీ, తాజాగా ఓ దంపతులు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ దేవుడికి టమాటాలతో మొక్కు చెల్లించారు. ఏంటా స్టోరీ అంటే..

అది ఏపీలోని అనకాపల్లి. ఇదే ప్రాంతంలో జగ్గ అప్పారావు-మోహని దంపతులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం టమాటా ధరకు భారీగా డిమాండ్ ఉండడంతో ఈ దంపతులు అదే టమాటాలతో ఇక్కడే కొలువై ఉన్న నూకాలమ్మ అమ్మవారికి మొక్కు చెల్లించాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వారి కూతురుని తులాభారంలో కూర్చుబెట్టి మరో పక్క 51 కేజీల టామాటాలు, పంచదార, బెల్లంతో తులాభారం వేశారు. ఇక ఆలయానికి వచ్చిన భక్తులు ఈ తులాభారాన్ని చూసేందుకు పోటీ పడ్డారు. ఆ తర్వాత ఆ దంపతులు ఆ టమాటాలు, బెల్లం, పంచదార నిత్యాన్నదానం కోసం అందించారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టమాటాలతో మొక్కు చెల్లించిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: చనిపోయిన పెంపుడు కుక్కు.. సమాధి కట్టి పెద్దకర్మ చేసిన యజమాని

Show comments