iDreamPost

తెలుగునాడు రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య చౌదరి రాజీనామా

తెలుగునాడు రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య చౌదరి రాజీనామా

గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తెలుగుదేశం పార్టీకి వరసగా షాకులు తగులుతూనే ఉన్నయి. ఓటమి తరువాత పార్టీలో ఇమడలేక అనేక మంది నాయకులు పక్క పార్టీల వైపు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నారా లోకేష్ కి ముఖ్య అనుచరుడిగా పేరొందిన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, వ్యక్తిగత సమస్యల వలన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో జరుగుతున్న దీక్షలకు రెండు రోజుల క్రితం విద్యార్ధి ఐకాశ పేరుమీద హాజరయ్యి నిరసనలు తెలిపిన బ్రహ్మయ్య హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక తెలుగుదేశంలోని గ్రూపు రాజకీయాలే ప్రధాన కారణం అనే మాట వినిపిస్తుంది.

తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగాల్లో అంత్యంత బలమైన విభాగంగా ఉన్న తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బ్రహ్మయ్య చౌదరి విద్యార్ధి స్థాయినుంచే యువతని తెలుగుదేశం పట్ల ఆకర్షితులను చేయడంలో ప్రధాన పాత్ర పొషించారు. గత ఎన్నికల్లో కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక సభలు నిర్వహించి యువతను తమ పార్టీ ఓట్ బ్యాంక్ గా మార్చుకోవటానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే గతంలో తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న దేవినేని అవినాష్ ఆ పదవికి పార్టీకి రాజీనామ చేసి వై.సి.పి లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు యువతతో నేరు సత్సంబంధాలు ఏర్పరుచుకున్న తెలుగునాడు అధ్యక్షుడు కూడా హఠాత్తుగా పదవికి రాజీనామా చేయటంతో తెలుగుదేశానికి బలమైన విభాగాలుగా పేరున్న తెలుగు యువత , తెలుగునాడు లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇది తెలుగుదేశం పార్టీకి కలవరపరిచే అంశంగానే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి