iDreamPost

KCR Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజ!

KCR in Kamareddy, TS Election Results 2023: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించగా.. కాంగ్రెస్ హవా కొనసాగిస్తుంది.

KCR in Kamareddy, TS Election Results 2023: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించగా.. కాంగ్రెస్ హవా కొనసాగిస్తుంది.

KCR Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. కామారెడ్డిలో కేసీఆర్ వెనుకంజ!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తుందని వార్తలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. మరోవైపు తెలంగాణలో మూడు పార్టీలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కొడంగల్ తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పై పోటీగికి దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ రిజల్ట్ హూరా హూరీగా సాగుతుంది. వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కామారెడ్డిలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ ప్రకారం కామారెడ్డిలో మొదటి రౌండ్ లో రేవంత్ రెడ్డికి ఆధిక్యం లభించింది. అటు కొడంగల్ లో కూడా ఆయనే ఆధిక్యతలో ఉన్నారు. రెవంత్ రెడ్డిని రెండు నియోజకవర్గాల్లో ఓడిస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఆశలు నెరవేరలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, కామారెడ్డి లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పినప్పటికీ.. ఓటర్ల తీర్పు పూర్తిగా వ్యతిరేకత కనిపించింది.   అంతకు ముందు బీజేపీ అభ్యర్థి ఆదిక్యత కనబరిచినా.. అనూహ్యంగా రేవంత్ రెడ్డి ముందంజలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ 376, బీఆర్ఎస్ 276, బీజేపీ 76 ఓట్లు పోల్ అయ్యాయి. కాగా, కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకట్ రమణారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ దూసుకువెళ్తుంది. ఖైరతాబాద్ లో విజయారెడ్డి, నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, బాల్కోండ, బోదన్, ఆర్మూర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో ఏకంగా తొమ్మది స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగిస్తుంది. ఒక దాంట్లో సీపీఐ ఆధిక్యంలో ఉంది.

కొల్లాపూర్ లో మొదటి రౌండ్ లో జూపల్లి కృష్ణారావు, ఆలేరులో కాంగ్రెస్ అభ్యర్థి 760 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, సూర్యపేట జిల్లా హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. వైరాలో కాంగ్రెస్ అభ్యర్థి 1354 ఓట్ల ఆధిక్యతలో ఉండగా, బీఆర్ఎస్ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. సిరిసిల్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ముందంజలో కొనసాగుతున్నారు. పాలేరులో పొంగులేటి శ్రీనివాస్ 2,230 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బెల్లంపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ కు 2,160 తొలి రౌండ్ లో ఆధిక్యం దక్కించుకున్నారు. ములుగులో సీతక్క, వరంగల్ తూర్పున కొండా సురేఖ్ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పోస్టల్ బ్యాలెంట్ కౌంటింగ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి